నల్గొండ(Nalgonda) జిల్లా నాగార్జునసాగర్ హిల్ కాలని(Nagarjuna sagar Hill Colony) తాగునీటి ట్యాంకులో(Water Tank) కోతులు(Monkey) పడి చనిపోయిన సంఘటనపై నాగార్జునసాగర్ ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజనీరు నాగేశ్వరరావు స్పందించి వివరణ ఇచ్చారు. నందికొండ హిల్ కాలనీ లో రెండు వేల లీటర్ల సామర్థ్యం ఉన్న తాగునీటి ట్యాంకులు రెండు, అలాగే వెయ్యి లీటర్ల సామర్థ్యం ఉన్న ఒక తాగునీటి ట్యాంకు ఉన్నాయని, ఇవే కాకుండా కోతులు పడి చనిపోయిన మరో తాగునీటి ట్యాంకు కూడా వేరుగా ఉందని , అయితే గత మూడు రోజులుగా ఒక తాగునీటి ట్యాంకు ద్వారా తాగునీరు సరఫరా కావడం లేదని తెలుసుకొని కారణాన్ని పరిశీలించగా అందులో కోతులు పడి చనిపోయినట్లు తమ దృష్టికి వచ్చిందని ఎస్ ఈ తెలిపారు.

నల్గొండ(Nalgonda) జిల్లా నాగార్జునసాగర్ హిల్ కాలని(Nagarjuna sagar Hill Colony) తాగునీటి ట్యాంకులో(Water Tank) కోతులు(Monkey) పడి చనిపోయిన సంఘటనపై నాగార్జునసాగర్ ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజనీరు నాగేశ్వరరావు స్పందించి వివరణ ఇచ్చారు. నందికొండ హిల్ కాలనీ లో రెండు వేల లీటర్ల సామర్థ్యం ఉన్న తాగునీటి ట్యాంకులు రెండు, అలాగే వెయ్యి లీటర్ల సామర్థ్యం ఉన్న ఒక తాగునీటి ట్యాంకు ఉన్నాయని, ఇవే కాకుండా కోతులు పడి చనిపోయిన మరో తాగునీటి ట్యాంకు కూడా వేరుగా ఉందని , అయితే గత మూడు రోజులుగా ఒక తాగునీటి ట్యాంకు ద్వారా తాగునీరు సరఫరా కావడం లేదని తెలుసుకొని కారణాన్ని పరిశీలించగా అందులో కోతులు పడి చనిపోయినట్లు తమ దృష్టికి వచ్చిందని ఎస్ ఈ తెలిపారు. ఈ విషయాన్ని వెంటనే మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని ,మున్సిపల్ అధికారులు తాగునీటి ట్యాంక్ నుండి చనిపోయిన కోతులను తీసివేసి శుభ్రం చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ తాగునీటి ట్యాంకు ద్వారా కేవలం 50 ఇళ్లకు మాత్రమే తాగునీటిని సరఫరా చేస్తున్నామని ,గత మూడు రోజులుగా ఈ వాటర్ ట్యాంక్ నుండి ఇలాంటి తాగునీటిని సరఫరా చేయడం లేదని స్పష్టం చేశారు. హిల్ కాలనిలో ఉన్న ప్రధాన ఇళ్ళకు తాగునీరు సరఫరా చేసే వాటర్ ట్యాంకులకు ,కోతులు పడి దుర్మరణం చెందిన వాటర్ ట్యాంకు కు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయంలో ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. కోతులు పడి చనిపోయిన తాగునీటి ట్యాంకును శుభ్రం చేయడం జరిగిందని పూర్తిస్థాయిలో ఈ ట్యాంకును క్లోరినేట్ చేసిన తర్వాత తాగునీటిని వదులుతామని ఆయన వెల్లడించారు అప్పటివరకు ఈ తాగునీటి ట్యాంకు ద్వారా నీరు పొందుతున్న ఇండ్లకు ప్రత్యామ్నాయ మార్గం ద్వారా తాగునీటిని సరఫరా చేస్తామని ఆయన పేర్కొన్నారు

Updated On 4 April 2024 12:35 AM GMT
Ehatv

Ehatv

Next Story