నవమాసాలు మోసి కని పెంచిన తల్లినే కాదన్నారు కొడుకులు.

నవమాసాలు మోసి కని పెంచిన తల్లినే కాదన్నారు కొడుకులు. వారు కొడుకులు కాదు దొంగనా కొడుకులు. అమ్మను కొట్టి ఇంటి నుంచి వెళ్లగొట్టారు. ఒంటిమీద ఉన్న నగలు, ఉన్న భూమిని కూడా లాగేసుకుని కట్టుబట్టలతో గెంటేశారు. పాపం అప్పటి వరకు ఉన్న ఊళ్లో గౌరవంగా బతికిన ఆ మాతృమూర్తి ఇప్పుడు చేయి చాచి అందరిని అడుక్కుంటోంది. కొడుకులు, కోడళ్లు ఉన్నా ఒంటరి బతుకు బతుకుతోంది. మహబూబాబాద్‌(Mahaboob nagar) జిల్లా గార్ల మండలంలోని జెండాల బజార్‌కు చెందిన గాడెపల్లి నర్సమ్మ (78), గాడెపల్లి రామయ్య దంపతులకు ముగ్గరు కొడుకులు. వారి పేర్లు శ్రీను, రాజేశ్‌, కృష్ణ. ఆ ముగ్గురు కొడుకులను బాగా చదివించారు. అందరికీ పెళ్లిళ్లు చేశారు. రామయ్య చనిపోయాక నర్సమ్మ ఒంటరైంది. వృద్ధాప్యంలో ఉన్న తల్లి బాగోగులు చూసుకోవాల్సిన ముగ్గురు కొడుకులు కర్కశంగా వ్యవహరించారు. ఆమెను కొట్టి బంగారు(Gold) నగలు గుంజుకొని ఇంట్లోంచి వెళ్లగొట్టారు. ఏం చేయాలో పాపం ఆ నర్సమ్మకు పాలుపోలేదు. గార్ల పట్టణంలో భిక్షాటన చేస్తూ కడుపు నింపుకుంటున్నది. మూడు ఎకరాల భూమిని ముగ్గురు కొడుకులు పంచుకున్నారని, భూమిని పంచి ఇస్తున్నప్పుడు నెలకోకరు చొప్పున తనను చూసుకుంటారని పెద్ద మనుషుల ముందు కొడుకులు ప్రమాణం చేశారని, ఇప్పుడేమో తనను ఇంట్లోంచి వెళ్లగొట్టారని ఏడుస్తూ చెప్పింది నర్సమ్మ. తనకు ఉన్న ఒక్క గదిని కూడా కూల్చేశారని, తనకు న్యాయం చేయాలని పోలీసులను ఫిర్యాదు చేసింది.

Eha Tv

Eha Tv

Next Story