హైదరాబాద్‌లోని(Hyderabad) పేట్ బాషీరాబాద్(Bashirabad) ఏఎంఆర్ కాంప్లెక్స్‌లో(AMR Complex) ప్రమాదం చోటుచేసుకుంది. 3వ ఫ్లోర్ నుండి ఒక్కసారిగా లిఫ్ట్(Lift) తెగిపడిపోవడంతో ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో లిప్ట్ లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వారికి తీవ్రగాయాలయ్యాయి. వారిని శివ(21), కీర్తన(23), సునాయన (23) గా గుర్తించారు. వీరు ముగ్గురు లిఫ్ట్ ఎక్కిన కొద్దిసేపటికే లిఫ్ట్ తెగి పడిపోయింది.
హైదరాబాద్‌లోని(Hyderabad) పేట్ బాషీరాబాద్(pet Bashirabad) ఏఎంఆర్ కాంప్లెక్స్‌లో(AMR Complex) ప్రమాదం చోటుచేసుకుంది. 3వ ఫ్లోర్ నుండి ఒక్కసారిగా లిఫ్ట్(Lift) తెగిపడిపోవడంతో ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో లిప్ట్ లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వారికి తీవ్రగాయాలయ్యాయి. వారిని శివ(21), కీర్తన(23), సునాయన (23) గా గుర్తించారు. వీరు ముగ్గురు లిఫ్ట్ ఎక్కిన కొద్దిసేపటికే లిఫ్ట్ తెగి పడిపోయింది. దీంతో ఈ ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పెద్ద ఎత్తున శబ్దం రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురై పరుగుపరుగునా ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని వెంటనే స్థానిక హాస్పిటల్ కు తరలించారు. ఘటనా విషయం తెలుసుకున్న భాదితుల తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు.