వివాహేతర సంబంధమే చావులకు కారణమా? పోలీసులకు సవాల్‌గా నిలిచిన ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు. నగర శివారులో ఉన్న పెద్ద అంబర్‌పేటలో(Pedha Amberpet) ఓ యువకుడి మృతదేహం లభ్యమయ్యింది. డాక్టర్స్‌ కాలనీ సమీపంలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఆ యువకుడి మృతదేహాన్ని సోమవారం స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులకు సవాల్‌గా నిలిచిన ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు. నగర శివారులో ఉన్న పెద్ద అంబర్‌పేటలో(Pedha Amberpet) ఓ యువకుడి మృతదేహం లభ్యమయ్యింది. డాక్టర్స్‌ కాలనీ సమీపంలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఆ యువకుడి మృతదేహాన్ని సోమవారం స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అప్పట్నుంచి పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలితో(Teacher) ఉన్న వివాహేతర సంబంధం కారణంగా ఆమె భర్త నాగేశ్వరరావే(Nageshwar Rao) రాజేశ్‌ను(Rajesh) హత్య చేసి ఉంటాడన్నది పోలీసుల అనుమానం. కానీ రాజేశ్‌ హత్యతో తనకు సంబంధం లేదంటున్నారు నాగేశ్వరరావు.

ఈయన కూడా ప్రభుత్వ టీచరే! రాజేశ్‌పై దాడి చేశామన్న వార్తల్లో నిజం లేదంటున్నారు. అసలు రాజేశ్‌ ఎవరో కూడా తమకు తెలియని, తన భార్యను ఎవరో బ్లాక్‌ మెయిల్‌ చేసి భయపెట్టి ఉంటారని, అందుకే ఆమె ఆత్మహత్య(Sucide) చేసుకున్నదని చెబుతున్నారు. రాజేశ్‌తో వివాహేతర సంబంధం ఉందనేది కూడా అబద్ధమని, బహుశా ఆమెకు రాజేశ్‌తో సోషల్‌ మీడియాలో పరిచయం ఏర్పడి ఉండవచ్చని నాగేశ్వరరావు అనుమానిస్తున్నారు. వాళ్లిద్దరికీ వయసులో చాలా తేడా ఉందని చెబతూ తన భార్య మరణంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని కోరుతున్నారు.

పోలీసులు చెబుతున్నదాని ప్రకారం .. హయత్‌నగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సుజాతతో(sujatha) రాజేశ్‌కు(Rajesh) పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం నెమ్మదిగా వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని గమనించిన సుజాత భర్త ఆమెను చాలాసార్లు మందలించారు. హెచ్చరించారు కూడా. దీంతో సుజాత మనస్తాపానికి గురయ్యారు. తాను చనిపోతానంటూ రాజేశ్‌తో జరిపిన వాట్సప్‌ చాటింగ్‌లో చెప్పారు. అలా చేయవద్దని, నువ్వు చనిపోతే తాను కూడా చనిపోతానని రాజేశ్‌ చెప్పాడట! చెప్పినట్టుగానే ఆమె ఈ నెల 24న పురుగుల మందు తాగారు.

పురుగుల మందు తాగిన తర్వాత ఆమె వాంతులు చేసుకున్నారు. ఇది గమనించిన నాగేశ్వరరావు వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం ఆమె కన్నుమూశారు. అయితే 24వ తేదీ నుంచి సుజాత ఇంటి చుట్టూ రాజేశ్‌ తిరుగుతూ కనిపించాడు. రాజేశ్‌ను చూసిన సుజాత కుమారుడు తన స్నేహితులతో కలిసి 26వ తేదీన రాజేశ్‌ను నిలదీశాడు. అతడి సెల్‌ఫోన్‌ పరిశీలించగా అసలు విషయం తెలిసింది. దీంతో వారు రాజేశ్‌ను కొట్టి మరోసారి ఇక్కడికి వస్తే బాగుండదని హెచ్చరించి పంపేశారట. మరి రాజేశ్‌ ఎలా చనిపోయి ఉంటాడు? సుజాత కొడుకు చంపాడా? లేక భర్త హత్య చేశారా? ఈ రెండూ కాకపోతే రాజేశ్‌ కూడా పురుగుల మందు తాగి చనిపోయాడా? పోలీసుల దర్యాప్తులో తేలాల్సిన విషయాలు ఇవి!

Updated On 30 May 2023 7:26 AM GMT
Ehatv

Ehatv

Next Story