ఓ వైద్యాధికారి(medical officer) తమను లైంగికంగా వేధింపులకు(Sexual Harassment) గురిచేస్తున్నాడని 21 మంది మహిళా మెడికల్ ఆఫీసర్ల(Female medical officers) ఫిర్యాదు చేశారు. కామారెడ్డి(Kamareddy) వైద్యాధికారిపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శితో పాటు, కలెక్టర్‌కు 21 మంది పీహెచ్‌సీల(PHC) మహిళా మెడికల్ ఆఫీసర్లు సంతకాలు చేసి ఫిర్యాదు చేశారు.
ఓ వైద్యాధికారి(medical officer) తమను లైంగికంగా వేధింపులకు(Sexual Harassment) గురిచేస్తున్నాడని 21 మంది మహిళా మెడికల్ ఆఫీసర్ల(Female medical officers) ఫిర్యాదు చేశారు. కామారెడ్డి(Kamareddy) వైద్యాధికారిపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శితో పాటు, కలెక్టర్‌కు 21 మంది పీహెచ్‌సీల(PHC) మహిళా మెడికల్ ఆఫీసర్లు సంతకాలు చేసి ఫిర్యాదు చేశారు. ఏడాదిన్నర కాలంగా తమ పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నాడని, శరీర భాగాలను తాకుతున్నాడని ఆరోపించారు. హెచ్‌సీలను సందర్శించినప్పుడు మహిళా వైద్యులు, సిబ్బందిని పక్కన కూర్చోవాలని చెబుతున్నాడు. ప్రతిఘటిస్తే గట్టిగా అరిచి కక్ష పెట్టుకుంటున్నాడని ఆరోపించారు. ఫోన్‌లో వైవాహిక స్థితిగతులను అడిగి మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని.. అంతేకాదు తన చాంబర్లో అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈనెల 8వ తేదీన జరిగిన విస్తృత సేవల శిక్షణ కార్యక్రమంలో అకస్మాత్తుగా వచ్చి మహిళా వైద్యులు, సిబ్బంది వ్యభిచారిణులుగా పనిచేస్తున్నారని అని అరిచాడని వాపోయారు. సాక్ష్యాలతో సహ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కామారెడ్డి వైద్యాధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నరు మహిళా మెడికల్ ఆఫీసర్లు