అందోలు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సమక్షంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరారు. మునిపల్లి మండలం పెద్దలోడి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు.. భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)లో చేరారు.

200 Congress workers join BRS in Andole
అందోలు ఎమ్మెల్యే(Andole MLA) క్రాంతి కిరణ్(Kranthi Kiran) సమక్షంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్(Congress) నుంచి బీఆర్ఎస్(BRS)లో చేరారు. మునిపల్లి(Munipalli) మండలం పెద్దలోడి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు(Congress Leaders).. భారత రాష్ట్ర సమితి (Bharatha Rastra Samithi))లో చేరారు. గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లేశం(Mallesham), ఉపసర్పంచ్ జగదీశ్వర్(Jagadeeshwar), మాజీ ఎంపీటీసీ సుందరం(Sundaram), సీనియర్ నాయకుడు అశోక్ పటేల్(Ashok Patel)తో పాటు గ్రామానికి చెందిన 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరారు.
ఈ సందర్భంగా అందోలు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముందుకు వస్తున్నారన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి(Telangana CM) చేస్తున్న పనులకు యావత్ దేశం ఆకర్శితులవుతుందన్నారు. పెద్దలొడి గ్రామానికి ప్రభుత్వం ఇప్పటికే నిధులు విడుదల చేసిందని, గ్రామంలో మిగిలిపోయిన పనులు పూర్తి చేసేందుకు మరిన్ని నిధులు మంజూరు చేసేందుకు అధికారులను కోరతామన్నారు.
