అన్నపూర్ణ స్టూడియో వద్ద బిగ్ బాస్ సీజన్-7 గ్రాండ్ ఫినాలే పూర్తి అయిన తర్వాత విన్నర్లు బయటికి వస్తున్న సమయంలో అక్కడకు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. ప‌లువురు ఆక‌తాయి అభిమానులు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించి అల్ల‌ర్ల‌కు దిగారు. ఆ స‌మ‌యంలో అక్క‌డ ఉన్న‌ బస్సులు, పోలీసు వాహనాలపై దాడికి పాల్పడ్డారు.

బిగ్ బాస్-7(Bigg Boss 7) ఫైనల్ గొడవ సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో ఇప్ప‌టికే బిగ్‌బాస్ విన్న‌ర్ ప‌ల్ల‌వి ప్ర‌శాంత్‌(Pallavi Prashanth)ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం చంచ‌ల్‌గుడా జైలుకు త‌ర‌లించ‌గా.. ఈ అల్ల‌ర్ల‌తో సంబంధం ఉన్న‌ మరో 16 మందిని తాజాగా అరెస్టు చేశారు.

అన్నపూర్ణ స్టూడియో వద్ద బిగ్ బాస్ సీజన్-7 గ్రాండ్ ఫినాలే పూర్తి అయిన తర్వాత విన్నర్లు బయటికి వస్తున్న సమయంలో అక్కడకు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. ప‌లువురు ఆక‌తాయి అభిమానులు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించి అల్ల‌ర్ల‌కు దిగారు. ఆ స‌మ‌యంలో అక్క‌డ ఉన్న‌ బస్సులు, పోలీసు వాహనాలపై దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ల‌లో రికార్డు అయ్యాయి. వాటిని ఆధారంగా చేసుకుని పోలీసులు దాడికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు వేట కొనసాగించారు.

ఈ అల్ల‌ర్ల‌కు సంబంధించి మొదటగా సాయి, రాజు అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం సిద్దిపేట జిల్లాలో ఉన్న బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ తో పాటు అతని సోదరుడు మనోహర్‌ను కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అలాగే ఈ అల్ల‌ర్ల‌తో సంబంధం ఉన్న మ‌రో 16 మందిని గుర్తించిన పోలీసులు వారందర్నీ అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 12 మంది మేజర్లు, నలుగురు మైనర్లు ఉన్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు వారందరినీ కోర్టులో హాజరు పరుచనున్నారు.

ఇదిలావుంటే.. పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ పూర్తైంది. వాద‌న‌లు విన్న న్యాయ‌మూర్తి తీర్పును రేపటికి వాయిదా వేశారు. పల్లవి ప్రశాంత్ కు బెయిల్ మంజూరు చెయ్యాలని ప్రశాంత్ తరపు కోరారు. పోలీసులు సరైన భద్రత కల్పించకపోవడం వల్లే ఇలాంటి పరిణామాలు జరిగాయన్నారు. ప్రశాంత్ కు బయట జరిగిన ఉదంతం తెలియదని కోర్టుకు తెలిపారు. బెయిల్ పిటిషన్ పై వాదనలు పూర్తవగా.. తీర్పును రేపటికి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు.

Updated On 21 Dec 2023 7:39 AM GMT
Ehatv

Ehatv

Next Story