ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి త‌ప్పుడు స‌మాచారం వ్యాప్తి చేసిన‌ కేసులో భారత రాష్ట్ర సమితి నాయ‌కుడు మన్నె క్రిశాంక్‌ను బుధవారం తూర్పు మారేడ్‌పల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి త‌ప్పుడు స‌మాచారం వ్యాప్తి చేసిన‌ కేసులో భారత రాష్ట్ర సమితి నాయ‌కుడు మన్నె క్రిశాంక్‌ను బుధవారం తూర్పు మారేడ్‌పల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. కొత్తగూడెం నుంచి హైదరాబాద్‌కు వ‌స్తుండ‌గా పత్తంగి టోల్‌గేట్ వద్ద పోలీసులు క్రిశాంక్‌ను అరెస్టు చేసిన‌ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం తూర్పు మారేడ్‌పల్లి కోర్టులో హాజరుపరిచారు. హాస్టళ్ల మూసివేత, ఓయూలో మెస్‌లకు సంబంధించి క్రిశాంక్ నకిలీ సర్క్యులర్‌లు సృష్టించి ప్రచారం చేశాడని ఓయూ చీఫ్ వార్డెన్ ఆఫ్ హాస్టల్స్ అండ్ మెస్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు క్రిశాంక్‌పై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 466, 468, 469, 505(1) కింద క్రిశాంక్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ కేసులో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

Updated On 1 May 2024 10:50 PM GMT
Yagnik

Yagnik

Next Story