తెలంగాణలో(Telangana) కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రి రేవంత్‎రెడ్డి(Revanth Reddy) సహా..మరో పదకొండు మంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. అయితే అందులో కేవలం ముగ్గురు మంత్రులకు మాత్రమే క్లీన్ చీట్(Clean cheat ministers) వచ్చింది. మంత్రులు దామోదర్‌ రాజనర్సింహ(Damodar Rajanarsimha), తుమ్మల నాగేశ్వర్‌రావు(Thummala Nageswar Rao), పొంగులేటి శ్రీనివాస్‎రెడ్డిపై(Ponguleti Srinivas Reddy) ఎలాంటి క్రిమినల్‌ కేసులు లేవని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రాటిక్‌ రిఫార్మ్స్, తెలంగాణ ఎలక్షన్‌ వాచ్‌ సంస్థలు వెల్లడించాయి. ఇక సీఎం రేవంత్ రెడ్డి సహా మరో 9 మంది మంత్రులపై మొత్తం 136 క్రిమినల్ కేసులు(Criminal Case) ఉన్నాయి. అందులో అతి తీవ్రమైన కేసులు 50 ఉన్నట్టు తేలింది.

తెలంగాణలో(Telangana) కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రి రేవంత్‎రెడ్డి(Revanth Reddy) సహా..మరో పదకొండు మంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. అయితే అందులో కేవలం ముగ్గురు మంత్రులకు మాత్రమే క్లీన్ చీట్(Clean cheat ministers) వచ్చింది. మంత్రులు దామోదర్‌ రాజనర్సింహ(Damodar Rajanarsimha), తుమ్మల నాగేశ్వర్‌రావు(Thummala Nageswar Rao), పొంగులేటి శ్రీనివాస్‎రెడ్డిపై(Ponguleti Srinivas Reddy) ఎలాంటి క్రిమినల్‌ కేసులు లేవని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రాటిక్‌ రిఫార్మ్స్(Association for Democratic Reforms), తెలంగాణ ఎలక్షన్‌ వాచ్‌ సంస్థలు వెల్లడించాయి. ఇక సీఎం రేవంత్ రెడ్డి సహా మరో 9 మంది మంత్రులపై మొత్తం 136 క్రిమినల్ కేసులు(Criminal Case) ఉన్నాయి. అందులో అతి తీవ్రమైన కేసులు 50 ఉన్నట్టు తేలింది.

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం ముగ్గురు మంత్రులపైనే ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని.. తాజా ఏడీఆర్, తెలంగాణ ఎలక్షన్ వాచ్ రిపోర్టులో తేలింది. మంత్రివర్గంలో ముఖ్యమంత్రి రేవంత్‎రెడ్డిపైనే అత్యధికంగా 89 పోలీసు కేసులున్నాయి. సీఎంపై నమోదైన క్రిమినల్ కేసుల్లో 50 కేసులు తీవ్రమైనవిగా ఉన్నాయి. ఇక రెండో స్థానంలో 11 కేసులతో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‎కుమార్‎రెడ్డి(Uttam Kumar Reddy) ఉన్నారు. 7 కేసులతో రవాణాశాఖ మంత్రి పొన్న ప్రభాకర్(Ponna Prabhakar ), 6 కేసుల చొప్పున ఆర్ అండ్ బీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Duddilla Sridhar Babu), దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, 3 కేసుల చొప్పున డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క(Bhati Vikramarka), ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు.

అయితే వీరంతా ఎన్నికల సమయంలో తమపై క్రిమినల్ కేసులు పెండింగులో ఉన్నాయని కేంద్ర ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్లలో వెల్లడించారు.
ప్రస్తుతం మంత్రులుగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, దామోదర్ రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు మాత్రం తమపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని చెప్పారు. నేర చరిత్ర లేని క్లీన్ ఇమేజ్ ఉన్న మంత్రులు ముగ్గురు ఉండటం విశేషం. మిగిలిన 9 మంది మంత్రులపై 136 కేసులున్నాయి.

తెలంగాణలో సికింద్రాబద్ మినహా 118 మంది ఎమ్మెల్యేలలో 72 మందిపై క్రిమినల్ కేసులు ఉండగా, 46 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 101 మంది ఎమ్మెల్యేలలో 58 శాతం మంది అంటే 59 మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. 119 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 118 మంది నేర, ఆర్థిక, ఇతర నేపథ్య వివరాలను విశ్లేషించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ , తెలంగాణ ఎలక్షన్ వాచ్ ఈ నివేదికను విడుదల చేశాయి. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్‌లు, ఆ తర్వాత నిర్వహించిన ఎన్నికల ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు.

Updated On 11 Dec 2023 12:08 AM GMT
Ehatv

Ehatv

Next Story