హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై 108 అంబులెన్స్ హల్చల్ చేసింది.

హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై 108 అంబులెన్స్ హల్చల్ చేసింది. సినీ పక్కిలో హైవేపై భయానక వాతావరణ సృష్టించిన అంబులెన్స్‌ను ఛేజ్ పట్టుకున్న తెలంగాణ పోలీసులు. 108 అంబులెన్స్(108 Ambulance ) ను చోరీ చేసి విజయవాడ(Vijayawada) వైపునకు తీసుకువెళ్తున్నారన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. హయత్‌నగర్‌లో 108 చోరీ చేసి ఖమ్మం(Khammam) వైపు వెళ్తున్న దొంగ. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ నుండి నకిరేకల్ పోలీస్ స్టేషన్ వరకు చిక్కని అంబులెన్స్ దొంగ. చిట్యాల వద్ద అంబులెన్స్‌ను ఆపడానికి ప్రయత్నించిన ఎస్ఐ జాన్‌రెడ్డి(SI Jan Reddy)ని ఢీ కొట్టి మరీ దొంగ పారిపోయాడు. అంతేకాకుండా కొర్లపహాడ్ టోల్‌గేటును ఢీ కొట్టి పారిపోయిన అంబులెన్స్ దొంగ. ఎట్టకేలకు టేకుమట్ల(Tekumatla) స్టేజి వద్ద రోడ్డుకు అడ్డంగా లారీలను పెట్టి అంబులెన్స్ తో పారిపోతున్న దొంగను పట్టుకున్న కేతేపల్లి ఎస్ఐ శివతేజ. కేతేపల్లి పోలీసుల అదుపులో అంబులెన్స్ దొంగ ఉండడంతో ఊపిరి పీల్చుకున్న 108 సిబ్బంది. గతంలో ఇదేవిధంగా అంబులెన్స్ ను చోరీ చేసినట్లు కేతేపల్లి ఎస్సై శివతేజ తెలిపారు.


Updated On 7 Dec 2024 6:33 AM GMT
ehatv

ehatv

Next Story