ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ సభలో పాల్గొనడంపై ఎన్నికల కమిషన్, సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి

తెలంగాణ లోని సిద్ధిపేట జిల్లాలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన 106 మంది ప్రభుత్వ ఉద్యోగులు సస్పెన్షన్ కు గుర‌య్యారు. ఇటీవల మెదక్ బీఆర్ఎస్‌ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి సమావేశంలో పాల్గొన్న 106 మంది ప్రభుత్వ ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు పడింది. MCCని ఉల్లంఘించి BRS మెదక్ అభ్యర్థి P వెంకట్రామి రెడ్డి నిర్వహించిన రాజకీయ సమావేశానికి హాజరైనందుకు 106 మంది తెలంగాణ ప్రభుత్వ అధికారులను ఎన్నికల సంఘం మంగళవారం సస్పెండ్ చేసింది. రాజపుష్ప రియల్ ఎస్టేట్ గ్రూపుతో సంబంధం ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి, ఎన్నికల సంఘం అనుమతి లేకుండా ప్రభుత్వ ఉద్యోగులతో రహస్య సమావేశం ఏర్పాటు చేశారని బీజేపీ మెదక్ అభ్యర్థి ఆరోపించారు.

ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ సభలో పాల్గొనడంపై ఎన్నికల కమిషన్, సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారికి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన 106 మంది ప్రభుత్వ ఉద్యోగులు స‌స్పెండ్‌ అయ్యారు.

Updated On 9 April 2024 9:08 PM GMT
Yagnik

Yagnik

Next Story