తెలంగాణ పోలీస్‌శాఖలో(TS Police) ముగ్గురు కానిస్టేబుళ్లుపై(Constables) వేటువేశారు(suspend).
తెలంగాణ పోలీస్‌శాఖలో(TS Police) ముగ్గురు కానిస్టేబుళ్లుపై(Constables) వేటువేశారు(suspend). హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్‌స్టేషన్(Madhunagar Police) పరిధిలో స్పా సెంటర్లు, వ్యభిచార గృహాల(Postitute house) నుంచి నెలవారీ వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురు కానిస్టేబుల్స్‌ను సీపీ సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే మధురానగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ముగ్గురు కానిస్టేబుల్స్ దామోదర్, నాగరాజు, సతీష్‌లను హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సస్పెండ్ చేశారు. ఈ ముగ్గురు కానిస్టేబుళ్లు పోలీస్‌స్టేషన్ పరిధిలోని స్పా సెంటర్లు, వ్యభిచార గృహాల నుంచి నెలవారీ వసూళ్లు చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు లంచాలతోపాటుగా అక్కడి యువతులతో వీరు రాసలీలలకు కూడా పాల్పడుతున్నారని ఫిర్యాదు వచ్చాయి. దీంతో, రంగంలోకి దిగిన పోలీస్‌శాఖలోని ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా స్పా సెంటర్‌లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. వాటిలోకి ముగ్గురు కానిస్టేబుళ్లు, మరో హోంగార్డు వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజ్‌లో కనిపించాయి. దీంతో ఆరోపణలు నిజమేనని నిర్ధారణకు వచ్చిన తర్వాత కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. హోంగార్డు రాజును మోటారు ట్రాన్స్‌పోర్టుకు పంపించి చర్యలు తీసుకున్నట్లు వివరించారు.