గత ఏడాది ప్రీమియం మోడల్ గా లాంచ్ అయిన షావోమీ 12 ప్రో (Xiaomi 12 Pro) స్మార్ట్‌ఫోన్ పై ఏకంగా 10,000 రూ తగ్గించినట్లు ప్రకటించింది షావోమీ ఇండియా. షావోమీ 13 ప్రో రీసెంట్ గా లాంచ్ అయిన సందర్భంలో ముందు రిలీజ్ చేసిన 12 ప్రో మోడల్ ధర తగ్గించటం జరిగింది. షావోమీ 12 ప్రో (Xiaomi 12 Pro) ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ […]
గత ఏడాది ప్రీమియం మోడల్ గా లాంచ్ అయిన షావోమీ 12 ప్రో (Xiaomi 12 Pro) స్మార్ట్‌ఫోన్ పై ఏకంగా 10,000 రూ తగ్గించినట్లు ప్రకటించింది షావోమీ ఇండియా. షావోమీ 13 ప్రో రీసెంట్ గా లాంచ్ అయిన సందర్భంలో ముందు రిలీజ్ చేసిన 12 ప్రో మోడల్ ధర తగ్గించటం జరిగింది.
షావోమీ 12 ప్రో (Xiaomi 12 Pro) ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.62,999 కాగా, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.66,999. రెండు వేరియంట్లలో లభిస్తుంది . ఇప్పుడు ఏ మొబైల్స్ 10,000 రూ తగ్గించగా 56,999 రూ ధరకే అందుబాటులోకి రావటం విశేషం . HDFC బ్యాంకు కార్డు తో కొనుగోలు చేసినవారికి అదనం గా 3000/- రూ తగ్గింపు లబిస్తుంది . ఈ ధరలు ఈ రోజు నుండే అంటే మార్చి 1వ తారీఖు నుండి అమలు లోకి రానున్నాయి . షావోమి వినియోగదారులకు ఎక్స్చేంజి ఆఫర్లో మొబైల్ ను కొనుగోలు చేస్తే మరో 5000/- రూ వరకు అదనంగా లభిస్తుంది .
షావోమీ 12 ప్రో (Xiaomi 12 Pro) ఫీచర్స్ ఓ లుక్ వేసేద్దాం
*6.73 అంగుళాల WQHD+ అమొలెడ్ డిస్‌ప్లే
*ఆపరేటింగ్ సిస్టమ్‌ఆండ్రాయిడ్ 12 + ఎంఐయూఐ 13
*3 years ఆండ్రాయిడ్ ఓఎస్,4 years సెక్యూరిటీ సపోర్ట్
*ట్రిపుల్ కెమెరా ,50మెగాపిక్సెల్ Sony IMX707 సెన్సార్ + 50మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ + 50మెగాపిక్సెల్ టెలీఫోటో సెన్సార్లతో పని చేస్తుంది
*32మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
* 4,600ఎంఏహెచ్ బ్యాటరీ
*120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్,50వాట్ వైర్‌లెస్ టర్బో ఛార్జింగ్,10వాట్ రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్
*బ్లూ, గ్రే, పర్పుల్ కలర్స్‌లో అందుబాటులో ఉంది షావోమీ 12 ప్రో (Xiaomi 12 Pro).
తాజా గా షావోమీ 13 సిరీస్‌లో తొలి స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది . ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.79,999 కాగా రూ.10,000 డిస్కౌంట్ ఆఫర్‌తో రూ.69,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇందులో కూడా మూడు 50మెగాపిక్సెల్ కెమెరాలు, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, LTPO ఓలెడ్ డిస్‌ప్లే, 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.