✕
World's First Artificial Womb : భవిష్యత్తు మానవడు ల్యాబ్‌లోనే..మానవ చరిత్రలో మరో అద్భుతం !
By EhatvPublished on 15 Dec 2023 1:51 AM GMT
మాతృత్వం(Motherhood) అనేది ఆడాళ్లకి ఓ వరం. అమ్మ అనే పిలుపు కోసం తాపత్రయం పడని ఆడవాళ్లు ఉండరు. దాంపత్య జీవితంలో పిల్లలను కనడం ఒక ముఖ్యమైన భాగం. వివాహమై(Marriage) ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టనివాళ్లు మానసికంగా కుంగిపోతారు. అలాంటి వాళ్లు పిల్లల కోసం మొక్కని దేవుడు.. ఎక్కని గుడి(Temple) మెట్లు ఉండవు. అయితే ఆధునిక సాంకేతికత(Technology) పుణ్యమా అని అలాంటి టెన్షన్ అక్కరలేకుండాపోయింది. ప్రస్తుతం ఐవీఎఫ్, సరోగసీ వంటి అనేక కృత్రిమ గర్భధారణ విధానాలు అందుబాటులోకి వచ్చాయి. అదంతా పాతపద్దతి. తాజాగా, కృత్రిమ గర్భధారణతో పిల్లలను కనే మిషన్ గురించి పెట్టిన వీడియో యూట్యూబ్‌ను(Youtube) షేక్ చేస్తోంది.

x
artifical womb
-
- మాతృత్వం(Motherhood) అనేది ఆడాళ్లకి ఓ వరం. అమ్మ అనే పిలుపు కోసం తాపత్రయం పడని ఆడవాళ్లు ఉండరు. దాంపత్య జీవితంలో పిల్లలను కనడం ఒక ముఖ్యమైన భాగం. వివాహమై(Marriage) ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టనివాళ్లు మానసికంగా కుంగిపోతారు. అలాంటి వాళ్లు పిల్లల కోసం మొక్కని దేవుడు.. ఎక్కని గుడి(Temple) మెట్లు ఉండవు. అయితే ఆధునిక సాంకేతికత(Technology) పుణ్యమా అని అలాంటి టెన్షన్ అక్కరలేకుండాపోయింది. ప్రస్తుతం ఐవీఎఫ్, సరోగసీ వంటి అనేక కృత్రిమ గర్భధారణ విధానాలు అందుబాటులోకి వచ్చాయి. అదంతా పాతపద్దతి. తాజాగా, కృత్రిమ గర్భధారణతో పిల్లలను కనే మిషన్ గురించి పెట్టిన వీడియో యూట్యూబ్‌ను(You tube) షేక్ చేస్తోంది.
-
- ఆధునిక కాలంలో పని ఒత్తిడి(Stress)..బిజీ లైఫ్ కారణంగా కొత్త దంపతులకు పిల్లలు పుట్టడం పెద్ద సమస్యగా మారింది. చాలా మందికి గర్భసంచిలో సమస్యలు, ఇతర అనారోగ్య కారణాల వల్ల పిల్లలు కలగడం లేదు. అలాంటి వారికి వరంలా వచ్చింది ఐవీఎఫ్ పద్ధతి. ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) అంటే తండ్రి నుంచి స్పెర్మ్(Sperm), తల్లి నుంచి అండం తీసుకుని ల్యాబ్‌లో(Lab) కృత్రిమ పద్ధతిలో ఫలదీకరణం అయ్యేలా చేస్తారు. పిండం ఏర్పడ్డాక దాన్ని తల్లి గర్భంలో ప్రవేశ పెడతారు. ల్యాబ్ లో ఏర్పడిన పిండం బిడ్డగా ఎదగాలంటే కచ్చితంగా తల్లి గర్భం కావాల్సిందే. కానీ సమీప భవిష్యత్తులో తల్లితో అవసరం లేదు. తల్లికి పురిటి నొప్పులు పడే బాధ కూడ ఉండదు.
-
- ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రయోగశాలల్లోనే కృత్రిమ గర్భాశయాలు సిద్ధమవుతున్నాయి. చదువుతుంటే సైన్స్ ఫిక్షన్(Science fiction) కథలా అనిపించవచ్చు కానీ, దీనికి సంబంధించిన ప్రయోగాలు(Experiments), సదుపాయాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో ఫలదీకరణం నుంచి తొమ్మిది నెలల వరకు ఈ బిడ్డ కృత్రిమ గర్భంలోనే పెరుగుతుంది. ఈ ప్రక్రియలో కృత్రిమ గర్భం(Artificial pregnancy) తెరను తీసి బిడ్డను బయటికి తీస్తారు. తరువాత ఆ గర్భంలో మరో బిడ్డను పెంచడం మొదలుపెడతారు. ఇలా ఏడాదికి 30,000 బిడ్డలను సృష్టించేందుకు వీలుగా అతి పెద్ద ల్యాబ్‌ను నిర్మిస్తున్నారు శాస్త్రవేత్తలు.
-
- ప్రపంచంలోనే దీన్ని సృష్టికి పున:సృష్టి అని చెప్పవచ్చు. ఈ కృత్రిమ గర్భ కర్మాగారం పేరు ఎక్టో లైఫ్(EctoLife). బెర్లిన్‌కు చెందిన బయోటెక్నాలజిస్టు హషేమ్ అల్ ఘైలీ దీని సృష్టికర్త. సంతానం లేని తల్లిదండ్రుల కోసం ఈ ల్యాబ్‌ను నిర్మిస్తున్నారాయన. ఈ ఎక్టో లైఫ్ గర్భధారణ ద్వారా ఆడవాళ్లు(Women) పడుతున్న బాధలను తగ్గించడం, అలాగే సి సెక్షన్(C Section) కాకుండా వారి ఆరోగ్యాన్ని కాపాడడమని చెబుతున్నారు. ప్రస్తుతం ఇది ఇంకా పరిశోధన దశలోనే ఉంది. ఇదే జరిగితే తల్లి గర్భం అవసరం లేకుండానే పిల్లలు పుట్టేస్తారు. కానీ ఇది ప్రకృతికి(Nature) విరుద్ధమని వాదిస్తున్న వారు ఉన్నారు. తల్లి గుండె చప్పుడు వింటూ బిడ్డ పెరగడం అత్యవసరమని చెబుతున్నారు. అదే వారి మధ్య బంధాన్ని పెంచుతుందని అంటున్నారు.

Ehatv
Next Story