కొత్త కొత్త ఫీచర్ల(New Features)తో ఎప్పటికప్పుడు తనని తాను అప్‌డేట్ చేసకుంటూ వస్తున్న వాట్సాప్(WhatsApp) తాజాగా మారో ఫీచర్‌ను మన మందుకు తీసుకురానుంది. ఇతర యాప్‌ల్లోని యూజర్లకు మెసేజ్ పంపేందుకు క్రాస్ ప్లాట్‌ఫామ్ ఫీచర్(Cross Platform Feature)ను తీసుకురానుంది.
కొత్త కొత్త ఫీచర్ల(New Features)తో ఎప్పటికప్పుడు తనని తాను అప్‌డేట్ చేసకుంటూ వస్తున్న వాట్సాప్(WhatsApp) తాజాగా మారో ఫీచర్‌ను మన మందుకు తీసుకురానుంది. ఇతర యాప్‌ల్లోని యూజర్లకు మెసేజ్ పంపేందుకు క్రాస్ ప్లాట్‌ఫామ్ ఫీచర్(Cross Platform Feature)ను తీసుకురానుంది. అంటే మనం వాట్సాప్ నుంచి టెలిగ్రామ్(WhatsApp to Telegram), సిగ్నల్(Signal), స్నాప్(Snap) ఇతర యాప్ యూజర్లకు సందేశాల్ని పంపేందుకు థర్డ్ పార్టీ చాటింగ్ (Third Party Chatting)సెక్షన్ తీసుకొస్తున్నట్లు వాట్సాప్ మాతృసంస్థ మెటా తెలిపింది. వాట్సాప్ వినియోగదారులు తమ మెసేజెస్‌ను ఇతర యాప్‌ల్లోని యూజర్లకు పంపేందుకు క్రాస్ ప్లాట్‌ఫామ్ మెసేజింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు తెలిపింది. అయితే ఈయూ నిబంధనల ప్రకారం ముందుగా దీనిని యూరప్ దేశాల్లో తీసుకొస్తారని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫీచర్‌ను ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారనే ఇంకా తెలియాల్సి ఉంది. ఈ కొత్త ఫీచర్‌పై మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని వాట్సాప్ ఇంజినీర్ డిక్ బ్రౌజర్ తెలిపారు. అయితే టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్, గూగుల్, ఐమెసేజ్ (యాపిల్) మొదలైనవి వాట్సాప్‌తో చేతులు కలుపుతాయా లేదా అన్నది తెలియాల్సి ఉంది. వాట్సాప్ వినియోగదారుల ప్రైవసీ, భద్రత దృష్ట్యా కొత్త కాన్సెప్ట్‌పై కంపెనీల మధ్య పలు ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు.