ప్రపంచంలోనే అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో WhatsApp ఒకటి, ఎవరితోనైనా సెకన్లలో కమ్యూనికేట్ చేయడానికి అవసరమయ్యే ఏకైక యాప్ . కొన్ని ట్రిక్‌లను ఉపయోగించి మీ మెసేజెస్ పంపించే విధానంలో మరిన్ని సులభమైన పద్దతులను తెలుసుకోవచ్చు .

మీరు నంబర్‌ను సేవ్ చేయకుండా ఎలా చాట్ చేయవచ్చు ,మరొకటి వాట్సాప్‌లో (WhatsApp)హై -క్వాలిటీ ఫొటోస్ పంపే ట్రిక్. మూడవ ట్రిక్ ఈ మెసేజింగ్ యాప్‌లో మీ ఆన్‌లైన్ స్టేటస్ (online status)తెలియకుండా ఎలా దాచవచ్చు. మూడు ముఖ్యమైన ట్రిక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచంలోనే అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో WhatsApp ఒకటి, ఎవరితోనైనా సెకన్లలో కమ్యూనికేట్ చేయడానికి అవసరమయ్యే ఏకైక యాప్ . కొన్ని ట్రిక్‌లను ఉపయోగించి మీ మెసేజెస్ పంపించే విధానంలో మరిన్ని సులభమైన పద్దతులను తెలుసుకోవచ్చు .

మీరు నంబర్‌ను సేవ్ చేయకుండా ఎలా చాట్ చేయవచ్చు ,మరొకటి వాట్సాప్‌లో(WhatsApp )హై -క్వాలిటీ ఫొటోస్ పంపే ట్రిక్. మూడవ ట్రిక్ ఈ మెసేజింగ్ యాప్‌లో మీ ఆన్‌లైన్ స్టేటస్ (online status)తెలియకుండా ఎలా దాచవచ్చు. మూడు ముఖ్యమైన ట్రిక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వాట్సాప్‌లో (Whatsapp)నంబర్ సేవ్ చేయకుండా చాట్ చేయండి
ఇది చాలా మంది యూజర్స్ ఎదుర్కొనే సమస్య. చాలా మంది వాట్సాప్‌లో నంబర్‌ను సేవ్ చేయడం ఇష్టం ఉండదు . కానీ ఏదైనా పని కోసం చాట్ చేయాలనుకుంటే ఎలా ?అనుకుంటున్నారా ... ఇలా చేస్తే నెంబర్ సేవ్ చేయకుండా కూడా చాట్ చేయవచ్చు.

మీరు ఎవరికీ మెసేజ్ చేయాలనుకుంటున్నారో వారి నంబర్‌ను కాపీ-పేస్ట్ చేసి, వాట్సాప్ లో ఉన్న ఏదైనా కాంటాక్ట్ కి పంపాలి. మీరు WhatsAppలో కాంటాక్ట్ కు పంపిన నంబర్‌పై నొక్కండి అప్పుడు యాప్ కొన్ని ఆప్షన్స్ చూపుతుంది. అందులో మెసేజ్ విత్ నెంబర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని చాట్ చెయ్యచ్చు. నంబర్‌ను సేవ్ చేయకుండా చాట్ చేయడానికి మీరు ఇప్పుడు టెన్షన్ పడకండి .

కాల్ లేదా మెసేజ్‌లో ఎవరితోనైనా త్వరగా కనెక్ట్ కావడానికి వాట్సాప్ (WhatsApp)ఉత్తమ మెసేజింగ్ యాప్‌లలో ఒకటి. కానీ, చాలా మంది వినియోగదారులను ఇబ్బంది పెట్టే విషయం ఏమిటంటే, హై క్వాలిటీ గల ఫోటోలు లేదా వీడియోలను పంపించటం ఇక్కడ కుదరదు . కానీ WhatsApp ఇప్పుడు యాప్ సెట్టింగ్‌లలో ఒక ఫీచర్‌ను ఇస్తుంది , అది బెస్ట్ క్వాలిటీ మీడియాను పంపడానికి మీకు అనుమతిస్తుంది. కానీ ఖచ్చితమైన క్వాలిటీ ని ఇక్కడ మెన్షన్ చేయలేదు . కానీ, ఇది సాధారణ షేరింగ్‌లో పొందే క్వాలిటీ కంటే మెరుగైన అప్‌లోడ్ క్వాలిటీ కలిగి ఉంటుంది . దీని కోసం, Settings >Storage and Data> Photo Upload Quality> Best Quality ఆప్షన్ కి వెళ్లాలి.

వాట్సాప్‌లో(Whatsapp) ఆన్‌లైన్‌లో ఉన్నామని ఎవరూ చూడకూడదనుకునే వారు యాప్ సెట్టింగ్ విభాగంలో తమ స్టేటస్ ని హైడ్ చేయచ్చు . . Settings > Privacy> Lastseen And Onlineవెళ్లాలి.Nobody” and “Same as last seen” options.సెలెక్ట్ చేయాలి . దీని వల్ల మీరు WhatsAppలో ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు ఎవరూ చూడలేరు . ఈ సెట్టింగ్ మార్చుకున్నాక మీరు ఆన్లైన్ ఉన్నారన్న విషయం అవతలి వాళ్లకు తెలియదు .

Updated On 28 April 2023 4:07 AM GMT
rj sanju

rj sanju

Next Story