వినియోగదారులను ఆకర్షించే విధంగా ,భద్రత ,గోప్యతలను దృష్టి లో ఉంచుకొని వాట్సాప్ ఈ ఏడాది చాల రకాల అప్డేట్ లను తీసుకు వచ్చింది . ఈ ఏడాది వాట్సాప్‌లో (WhatsApp)ఇప్పటివరకు ఎన్నో మంచి ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.తాజాగా 'ఈ యాప్‌కి సంబంధించి కొత్త అప్‌డేట్ బయటకు వచ్చింది. యాప్‌లోని మెసేజ్ వీడియో లేదా ఇమేజ్‌ని ఫార్వార్డ్ చేసే ముందు దాని డిస్క్రిప్షన్ ని ఎడిట్ చేసుకొనే విధంగా త్వరలో అందుబాటులోకి తీసుకు రాబోతుంది . ఈ ఫీచర్ వలన యూజర్ టైం సేవ్ అవుతుంది ఎందుకంటే ఇప్పటివరకు యూజర్ కాపీ-పేస్ట్ చేయడం ద్వారా ఈ పనిని చేయాల్సి వచ్చేది
వినియోగదారులను ఆకర్షించే విధంగా, భద్రత, గోప్యతలను దృష్టి లో ఉంచుకొని వాట్సాప్ ఈ ఏడాది చాల రకాల అప్డేట్ లను తీసుకు వచ్చింది . ఈ ఏడాది వాట్సాప్‌లో (WhatsApp)ఇప్పటివరకు ఎన్నో మంచి ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.తాజాగా 'ఈ యాప్‌కి సంబంధించి కొత్త అప్‌డేట్ బయటకు వచ్చింది. యాప్‌లోని మెసేజ్ వీడియో లేదా ఇమేజ్‌ని ఫార్వార్డ్ చేసే ముందు దాని డిస్క్రిప్షన్ ని ఎడిట్ చేసుకొనే విధంగా త్వరలో అందుబాటులోకి తీసుకు రాబోతుంది . ఈ ఫీచర్ వలన యూజర్ టైం సేవ్ అవుతుంది ఎందుకంటే ఇప్పటివరకు యూజర్ కాపీ-పేస్ట్ చేయడం ద్వారా ఈ పనిని చేయాల్సి వచ్చేది .
వాట్సాప్(WhatsApp) అభివృద్ధిని పర్యవేక్షించే వెబ్‌సైట్ wabetainfo ప్రకారం, WhatsApp ఈ కొత్త ఫీచర్‌ని త్వరలోనే లాంచ్ చేయబోతుంది , దాని తర్వాత వినియోగదారులు మెసేజ్ , వీడియోలు మరియు ఫోటోల డిస్క్రిప్షన్ ని ఎడిట్ చేసుకొనే అవకాశం ఉంటుంది . ప్రస్తుతం, మీరు ఒక మెసేజ్ నచ్చి దాన్ని ఎవరికైనా ఫార్వార్డ్ చేయాలనుకుంటే అలాగే దాని నుండి కొంత కంటెంట్‌ను రిమోవ్ చేయాలన్న లేదా మీరు సొంతంగా కంటెంట్ యాడ్ చేయాలన్న , మెసేజ్ ని కాపీచేసి పేస్ట్ చేయడం ద్వారా ఈ పనినిచేయాల్సి ఉంటుంది . టెక్స్ట్ మెసేజ్(text Message)లకు ఈ పని చాలా సులభం . కానీ ఫోటోలు ఇంకా వీడియోలలో ఉండే టెక్స్ట్ ని మార్చాలంటే ఇది చాలా కష్టం ఎందుకంటే మీరు ఆ ఫోటో లేదా వీడియోని గ్యాలరీ నుండి మళ్లీ సెర్చ్ చేసి పంపించాల్సి ఉంటుంది . కానీ కొత్త అప్‌డేట్ తర్వాత, వినియోగదారులు నేరుగా యాప్ నుండే ఫార్వార్డ్ చేయడానికి ముందు ఫోటోలు, వీడియోలు అలాగే మెసేజ్ డిస్క్రిప్షన్ ను ఎడిట్ చేసుకోవచ్చు .
WhatsApp మరొక అద్భుతమైన ఫీచర్‌ని తీసుకురావడానికి పని చేస్తోంది, దీనితో వినియోగదారులు తమ వ్యక్తిగత చాట్‌లను లాక్ చేసుకొనే అవకాశం ఉంటుంది .ఎవరైనా అనుకోకుండా మీ మొబైల్ ని తీసుకున్నపుడు మొత్తం చాట్స్ అన్ని చూసే అవకాశం ఉంటుంది . మీరు ఏ వ్యక్తితో చేసిన చాట్ ని లాక్ చేసి ఉంచాలో ఆ చాట్ ఎదుట వ్యక్తులు చూడలేరు. వారి చాట్ ఓపెన్ చేసి చూడాలన్న మీరు ఇచ్చిన పాస్ కోడ్ లేదా లాక్ ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది . దీనితో మీ పర్సనల్ చాట్ లను ఎవరు చూడలేరు . మీ వ్యక్తిగత చాట్ కి లాక్ చేసుకొనే సౌకర్యాన్ని తీసుకు రావటానికి వాట్సాప్ (WhatsApp)త్వరలో లోనే కొత్త అప్డేట్ (New update)తో రాబోతుంది . దీని కోసం వినియోగదారులు లాక్ లేదా , పాస్‌కోడ్ మొదలైనవాటిని ఉపయోగించవచ్చు.