ఈ రోజుల్లో వాట్సాప్ అంటే తెలియని వారు ఉండరేమో కదా...ప్రతి ఒక్కరి జీవితం లో స్మార్ట్ ఫోన్ మస్ట్ అవడం తో వాట్సాప్ ఉపయోగించే వారి సంఖ్య కూడా రోజు రోజు కి ఎక్కువ అవుతోంది. వాట్సాప్ లో కూడా ఫీచర్లు ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తూనే ఉంటాయి .. ఇదే క్రమంలో వాట్సాప్ తన కస్టమర్స్ కు మెరుగైన సేవలు అందించే ఉద్దేశ్యం తో సరికొత్త ఫీచర్లు తీసుకువస్తునే ఉంది . లేటెస్ట్ గా మరో కొత్త […]
ఈ రోజుల్లో వాట్సాప్ అంటే తెలియని వారు ఉండరేమో కదా...ప్రతి ఒక్కరి జీవితం లో స్మార్ట్ ఫోన్ మస్ట్ అవడం తో వాట్సాప్ ఉపయోగించే వారి సంఖ్య కూడా రోజు రోజు కి ఎక్కువ అవుతోంది. వాట్సాప్ లో కూడా ఫీచర్లు ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తూనే ఉంటాయి .. ఇదే క్రమంలో వాట్సాప్ తన కస్టమర్స్ కు మెరుగైన సేవలు అందించే ఉద్దేశ్యం తో సరికొత్త ఫీచర్లు తీసుకువస్తునే ఉంది . లేటెస్ట్ గా మరో కొత్త ఫీచర్‌ను ఇంట్రడ్యూస్ చేసేందుకు ప్రయత్నిస్తోంది.
వాట్సాప్ సైతం తన వినియోగ దారులకు మెరుగైన సేవలు అందించడానికి అనునిత్యం సరికొత్త ఫీచర్లు తీసుకొస్తూనే ఉంది. ఈ క్రమం లోనే లేటెస్ట్ గా మరో కొత్త ఫీచర్‌ను తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.
ఇక నుంచి ఎవరైనా వాట్సాప్ మెసేజ్ పంపితే ఒక్కసారి మాత్రమే ఆ మెసేజ్ చూసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆ మెసేజ్ కనిపించకుండా పోతుంది. మెసేజ్ పంపిన వారికి, అందుకున్న వారికి ఆటోమేటిక్‌గా డిలిట్ అయిపోతుంది. అదే వ్యూ వన్స్ మెసేజ్ ఫీచర్ అంటే ఇక నుంచి ఎవరైనా మనకు పంపిన మెసేజ్‌ను ఇతరులకు ఫార్వర్డ్ చేయలేము .
ఇంతకుముందు వాట్సాప్ లో వ్యక్తులు చేసే చాట్ కొంత టైం తర్వాత ఆటోమేటిక్‌గా దిలిట్ అయ్యేలా డిస్అపియరింగ్ అనే ఫీచర్ ఆల్రెడీ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే వాట్సాప్‌లో వన్స్ వ్యూ ఫీచర్.. వీడియోలు, ఫొటోలకు వినియోగంలో ఉంది. వీడియోలు లేదా ఫొటోలకు వన్స్ వ్యూ ఫీచర్ ఆప్షన్ ఎంచుకుంటే మాత్రం ఒక్కసారి మాత్రమే కనిపించి తదుపరి కనిపించకుండా పోతాయి. దీని స్క్రీన్న్ షాట్ తీసుకోవడం కూడా కుదరదు. వాట్సాప్ ఇదే ఫీచర్‌ను టెక్ట్స్ మెసేజ్‌కు వర్తింప జేయాలని ఆలోచన చేస్తోంది. అయితే దీన్ని పూర్తిస్థాయిలో యూజర్లందరికీ ఎప్పుడు అందుబాటులోకి తీసుకురానుందో చెప్పలేదు .