కొత్తగా వాహనాలు తీసుకునేవారు థర్డ్ పార్టీ భీమా గురించి వినే ఉంటారు. అయితే చాలా మందికి ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే ఏంటో తెలియదు. నిజానికి ఇది.. కొత్తగా వెహికల్స్ తీసుకునేవారికి చాలా ముఖ్యంగా. ఈ భీమా వాహన యజమానికి ఎలాంటి రక్షణ అందించదు.. కానీ ఇది చాలా కొత్తగా వాహనాలు తీసుకునేవారికి చాలా ఇంపార్టెంట్. మరీ ఈ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి అనేది తెలుసుకోవడం కూడా ముఖ్యమే. 2018 సంవత్సరం నుంచి ఇది అమలులోకి వచ్చింది.
కొత్తగా వాహనాలు తీసుకునేవారు థర్డ్ పార్టీ భీమా గురించి వినే ఉంటారు. అయితే చాలా మందికి ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే ఏంటో తెలియదు. నిజానికి ఇది.. కొత్తగా వెహికల్స్ తీసుకునేవారికి చాలా ముఖ్యంగా. ఈ భీమా వాహన యజమానికి ఎలాంటి రక్షణ అందించదు.. కానీ ఇది చాలా కొత్తగా వాహనాలు తీసుకునేవారికి చాలా ఇంపార్టెంట్. మరీ ఈ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి అనేది తెలుసుకోవడం కూడా ముఖ్యమే. 2018 సంవత్సరం నుంచి ఇది అమలులోకి వచ్చింది. కొత్తగా బైక్ తీసుకునేవారికి ఈ థర్డ్ పార్టీ భీమాను 5 ఏళ్లు, కారు కొనుగోలుకు 3 సంవత్సరాలపాటు పొందడం తప్పనిసరి చేశారు. ఈ భీమా అనేది వాహన యజమానికి ఎలాంటి రక్షణ అందించదు.... కానీ వాహనం ఏదైనా రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి ఈ భీమా రక్షణ లభిస్తుంది. థర్ట్ పార్టీ భీమాను లయబిలిటీ కవర్ అని కూడా అంటారు.
ఈ థర్డ్ పార్టీ భీమా అనేది.. వాహనం ప్రమాదానికి గురయినప్పుడు ఆర్థికంగా సాయపడుతుంది. ప్రమాదం తర్వాత ఆసుపత్రిలో అయ్యే ఖర్చులు.. ఇతర చట్టపరమైన ఖర్చులకు పనిచేస్తుంది. వీటన్నింటి క్లెయిమ్ ను భీమా కంపెనీ ఇస్తుంది. అయితే మన దేశంలో వాహనానికి ఇన్సూరెన్స్ చేయించని వారు చాలా మంది ఉన్నారు. ఇక ప్రమాదంలో తీవ్రంగా నష్టపోయి.. ఆర్థికంగా చితికిపోయినవారు ఉన్నారు. అందుకే ఈ థర్డ్ పార్టీ భీమాను తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ భీమా ఎలా పనిచేస్తుంది..
వాహన ప్రమాదంలో వ్యక్తికి భౌతికంగా (Physical Injured) నష్టం జరిగితే ఆ ఖర్చును భీమా కంపెనీ చెల్లిస్తుంది. ఇది కాకుండా థర్డ్ పార్టీ భీమా కింద ఆస్తికి జరిగిన నష్టాన్ని కూడా కంపెనీ భర్తీ చేస్తుంది. అయితే ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కింద భీమా కంపెనీ కేవలం ప్రమాదం వల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని మాత్రమే భర్తీ చేస్తుంది. భీమా కంపెనీ థర్డ్ పార్టికి క్లెయిమ్ చెల్లిస్తుంది.
భీమా కంపెనీ ఏ నష్టాలకు క్లెయిమ్ ఇస్తుంది..
థర్డ్ పార్టీ ఇన్సూరె్స్ కవర్ లో భీమా కంపెనీ భర్తీ చేసే నష్టాల్లో మీ వాహనం వల్ల మరొక వ్యక్తి వాహనానికి జరిగిన న,్టం.. మరొకరి ఆస్తికి జరిగిన నష్టం.. అలాకే.. పరిహారం తీవ్రమైన అంటే గాయపడడం.. ప్రాణాలు కోల్పోవడం జరిగినప్పుడు చట్టపరమైన లేదా కోర్టు విచారణ కోసం జరిగిన ఖర్చులను క్లెయిమ్ చేస్తుంది. ఒకవేళ వాహనం దొంగిలించబడితే ఎలాంటి సహయం రాదు.
ఇదిలా ఉంటే.. ప్రమాదంలో మీకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయడంలో థర్డ్ పార్టీ భీమా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.2000 జరిమానా లేదా 3 నెలలు జైలు శిక్ష విధించే రూల్ ఉంది. ఒకవేళ మీరు పదే పదే దొరికిపోతే.. ఒకేసారి రెండు శిక్షలు వేసే అవకాశం ఉంది.