సాంకేతికత రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. మనిషి బుర్రలో నుంచి వినూత్న ఆవిష్కరణలు వస్తున్నాయి. మనం ప్రతిరోజూ వాడే వస్తువులు వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నాయి. ఇలాంటిదే స్కూటర్ కమోడ్(Scooter commode) . మన దేశంలో ఇండియన్ టాయిలెట్స్‌ను వాడేవాళ్లం
సాంకేతికత రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. మనిషి బుర్రలో నుంచి వినూత్న ఆవిష్కరణలు వస్తున్నాయి. మనం ప్రతిరోజూ వాడే వస్తువులు వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నాయి. ఇలాంటిదే స్కూటర్ కమోడ్(Scooter commode) . మన దేశంలో ఇండియన్ టాయిలెట్స్‌ను వాడేవాళ్లం. తర్వాత తర్వాత వెస్ట్రన్ టాయిలెట్స్ (western toilets)రావడం.. వాటర్ ఫ్లష్ మ్యానువల్‌గా చేయకుండా సెన్సార్‌తో చేసే కమోడ్‌లు వచ్చాయి. రిమోట్ కంట్రోల్ కమోడ్‌లు కూడా వచ్చాయి. తాజాగా ఇప్పుడు స్కూటర్ కమోడ్ వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో(social media) ఒకటి వైరల్ అవుతోంది.
అయితే గతంలో మీరెప్పుడూ ఇలాంటి కమోడ్‌ను చూసి ఉండకపోవచ్చు. ఇంట్లోని టాయిలెట్‌లో కమోడ్‌కు ముందు స్కూటర్‌ను అమర్చారు. దీనికి ఇంకో ప్రత్యేకత ఉంది. జనరల్‌గా కమోడ్‌కు వెనుక భాగంలో ఫ్లష్ (flush)చేసే సౌకర్యం ఉంటుంది. కానీ ఈ స్కూటర్ కమోడ్‌ను ఫ్లష్ చేయాలంటే ఎక్సలేటర్ ఇస్తే చాలు వాటర్ ఫ్లష్ అవుతుంది. ఈ వీడియోను hergun1insaat అనే పేజీ ద్వారా Instagramలో పోస్టు చేశారు. ఈ ప్రత్యేకమైన టాయిలెట్ చూసిన తర్వాత ఒక నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.