సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అయినా ఇన్స్టాగ్రామ్ ,ట్విట్టర్ ,ఫేస్బుక్ లలో సెలబ్రిటీస్ కి అలాగే ప్రముఖ వ్యక్తులకి మాత్రమే పరిమితమైన బ్లూటీక్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వస్తుంది. మీరు సెలబ్రిటీ కాకపోయినా ఇక మీ అకౌంట్ కూడా వెరిఫై అయ్యి బ్లూ టిక్ వస్తుంది కాకపోతే కాస్త డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇంతవరకు ట్విట్టర్లో మాత్రమే ఈ బ్లూటిక్ వెరిఫికేషన్ పెయిడ్ వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఇదే బాటలోకి ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ కూడా త్వరలోనే […]
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అయినా ఇన్స్టాగ్రామ్ ,ట్విట్టర్ ,ఫేస్బుక్ లలో సెలబ్రిటీస్ కి అలాగే ప్రముఖ వ్యక్తులకి మాత్రమే పరిమితమైన బ్లూటీక్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వస్తుంది. మీరు సెలబ్రిటీ కాకపోయినా ఇక మీ అకౌంట్ కూడా వెరిఫై అయ్యి బ్లూ టిక్ వస్తుంది కాకపోతే కాస్త డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇంతవరకు ట్విట్టర్లో మాత్రమే ఈ బ్లూటిక్ వెరిఫికేషన్ పెయిడ్ వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఇదే బాటలోకి ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ కూడా త్వరలోనే రాబోతున్నాయి. Meta CEO మార్క్ జుకర్బగ్ ఫేస్బుక్ అకౌంట్ ద్వారా పెయిడ్ వెర్షన్ మెటా సర్వీసుల గురించి వివరణ ఇవ్వడం జరిగింది.ప్రతి నెల ఆండ్రాయిడ్ వినియోగదారులు 11 డాలర్లు (900rs) చెల్లిస్తే వారి సోషల్ మీడియా ఎకౌంట్ బ్లూ టిక్ తో వెరిఫై అవుతుంది. అది ios వినియోగదారులైతే దీని కోసం కాస్త ఎక్కువగా 14 డాలర్ల వరకు అంటే మన కరెన్సీలో దాదాపుగా 1200 rs వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ప్రస్తుతం Facebook, instagram పెయిడ్ సబ్స్క్రిప్షన్ సర్వీస్ న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో మాత్రమే ప్రారంభమైంది. త్వరలోనే ఈ సర్వీస్ అన్ని దేశాలలో ప్రారంభం కాబోతుంది. Facebook, instagram బ్లూ టిక్ వెరిఫికేషన్ కోసం మొదటి నెల పేమెంట్ చెల్లించేటప్పుడు ఏదైనా ప్రభుత్వ ఐడిని ఇవ్వాల్సి ఉంటుంది. వీళ్ళ అకౌంట్స్ కి బెస్ట్ కస్టమర్ సపోర్ట్ అలాగే సెక్యూరిటీ అనేది అదనంగా ఉంటుంది. అయితే ఇది పర్సనల్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే బిజినెస్ పేజెస్ ,పర్సనల్ పేజీల అకౌంట్స్ కి బ్లూ టిక్ వెర్షన్ వర్తించదు. ప్రస్తుతానికి IOS వినియోగదారులకు మాత్రమే ఈ బ్లూ టిక్ వెరిఫికేషన్ అనేది అందుబాటులోకి వస్తుంది.