గతం లో ఇండియా చైనా మధ్య జరిగిన భద్రత విషయాల దృష్ట్యా చైనా కి సంధించిన సోషల్ యాప్స్ ని బ్యాన్ చేయటం తెలిసిన విషయమే . వీటిలో తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ ని సంపాదించుకున్న సోషల్ యాప్  "టిక్ టాక్ ". ఈ యాప్ ని పూర్తి స్థాయి లో నిలిపివేసినందుకు చాలా మంది హర్షం వ్యక్తం  చేసారు . ఇప్పుడు ఇండియా తరహా లో నే పలు దేశాలు ఈ చైనా ఆధారిత […]

గతం లో ఇండియా చైనా మధ్య జరిగిన భద్రత విషయాల దృష్ట్యా చైనా కి సంధించిన సోషల్ యాప్స్ ని బ్యాన్ చేయటం తెలిసిన విషయమే . వీటిలో తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ ని సంపాదించుకున్న సోషల్ యాప్ "టిక్ టాక్ ". ఈ యాప్ ని పూర్తి స్థాయి లో నిలిపివేసినందుకు చాలా మంది హర్షం వ్యక్తం చేసారు . ఇప్పుడు ఇండియా తరహా లో నే పలు దేశాలు ఈ చైనా ఆధారిత యాప్ ని బ్యాన్ చేయాలన్న ఉద్దేశం తో ఉన్నాయి .

తాజాగా కెనడా ప్రభుత్వం కూడా టిక్ టాక్ బాన్ చేసింది. వినియోగదారుల భద్రత దృష్ట్యా ప్రమాదస్థాయి ఇబ్బందిని ఎదుర్కోవాల్సివస్తుందన్న ముందు జాగ్రత్త తో నే దీనిపై నిషేధాన్ని విధించటం జరిగిందని పేర్కొంది కెనడా ప్రభుత్వం .అలాగే ఇపుడు అదే బాటలో యూస్ కూడా త్వరలో టిక్ టాక్ యాప్ ని బ్యాన్ చేయాలనే ఆలోచనలో ఉంది . టిక్ టాక్ నిషేధం గురించి వచ్చే నెలలో ప్రవేశ పెట్టె బిల్లు లో హౌస్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ ఓటింగ్ జరిగే అవకాశంఉంది.

వరసగా వ్యతిరేకతలు వెల్లువెత్తుతున్న ఈ తరుణం లో టిక్ టాక్ సేఫ్టీ అండ్ ట్రస్ట్ అధినేత ఒక కీలక నిర్ణయాన్ని జారీ చేసారు . 18 ఏళ్ళ లోపు వయసు లోపల ఉన్నవాళ్లు టిక్ టాక్ ను గంటకు మించి వినియోగించలేరు ఇక మీదట. స్క్రీన్ టైం లిమిట్ ని తగ్గించే దిశగా గంట తర్వాత వీడియోస్ ప్లే అవ్వడం ఆగిపోతుంది. తిరిగి పాస్ కోడ్ ని ఎంటర్ చేస్తే మరో 30 నిమిషాల పాటు వీడియోస్ ని చూసే అవకాశం ఉంటుంది .

Updated On 3 March 2023 4:44 AM GMT
Ehatv

Ehatv

Next Story