సైన్స్‌ ఫిక్షన్‌ స్టోరీలు(science Fiction stories) ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు నిజం అవుతాయి. సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలు చూసినప్పుడు అసలు ఇలా జరుగుతుందా ఎక్కడైనా అని ఆ టైముకు అనిపిస్తుంటుంది. 2008లో వచ్చిన ఎక్స్‌ ఫైల్‌ ఐ వాంట్‌ టు బిలీవ్‌(X file I want to believe) అనే సినిమాలో ఓ వ్యక్తి తలను మరో వ్యక్తికి అమరుస్తారు. అంటే హెడ్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌(Head Transplantation) అన్నమాట! ఒకరి గుండె, మూత్రపిండాలు, కాలేయం, కళ్లు వంటి అవయవాలను మరొకరికి అమర్చడం సాధ్యమే కానీ తలను అమర్చడం సాధ్యమవుతుందా అన్న అనుమానాలు వచ్చాయి.

సైన్స్‌ ఫిక్షన్‌ స్టోరీలు(Science Fiction stories) ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు నిజం అవుతాయి. సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలు చూసినప్పుడు అసలు ఇలా జరుగుతుందా ఎక్కడైనా అని ఆ టైముకు అనిపిస్తుంటుంది. 2008లో వచ్చిన ఎక్స్‌ ఫైల్‌ ఐ వాంట్‌ టు బిలీవ్‌(X file I want to believe) అనే సినిమాలో ఓ వ్యక్తి తలను మరో వ్యక్తికి అమరుస్తారు. అంటే హెడ్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌(Head Transplantation) అన్నమాట! ఒకరి గుండె, మూత్రపిండాలు, కాలేయం, కళ్లు వంటి అవయవాలను మరొకరికి అమర్చడం సాధ్యమే కానీ తలను అమర్చడం సాధ్యమవుతుందా అన్న అనుమానాలు వచ్చాయి. అమెరికాకు చెందిన స్టార్టప్‌ కంపెనీ బ్రెయిన్‌ బ్రిడ్జ్‌(Brain bridge) సాధ్యమేనని అంటోంది. హెడ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ ఎలా చేయవచ్చో రోబోలతో చిత్రీకరించిన వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది కూడా! ప్రమాదాలలో అవయవాలు కోల్పోయినప్పుడో, అనారోగ్యంబారిన పడి దెబ్బతింటేనో దాతల నుంచి సేకరించిన అవయవాలను తీసుకుని రిప్లేస్‌ చేస్తారు. ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ అంటే ఇదే! మరి హెడ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ అటే ఏమిటి? అంటే తల మార్చడం.. క్యాన్సర్‌ వల్లనో, పక్షవాతం, అల్టీమర్స్‌, పార్కిన్సన్‌ వంటి నాడీ సంబంధ వ్యాధుల వల్లనో మెదడు పాడవుతుంటుంది. ఇలాంటి వారికి అప్పుడే మరణించిన వారి తలను అమర్చవచ్చట! బ్రెయిన్‌ డెడ్‌ వారికి కూడా ఈ విధంగా తల మార్చవచ్చట! బ్రెయిన్‌ బ్రిడ్జ్‌ విడుదల చేసిన వీడియోలో దీన్ని చక్కగా చూపించారు. హెడ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ తరహా ప్రయోగాలు 1900లోనే జరిగాయట! చాలా మంది శాస్త్రవేత్తలు జంతువులపై ఈ ప్రయోగాలు చేశారు. 1954లో ఆనాటి సోవియట్‌ యూనియన్‌కు చెందిన సర్జన్‌ ఒకరు ఓ కుక్కకు హెడ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ చేశాడు. కానీ సున్నితంగా ఉండే నాడీవ్యవస్థ, రక్తనాళాలు పనిచేయకపోవడంతో ఆ కుక్క కొన్ని రోజులకే చనిపోయింది. ఈ విషయం తెలుసుకాబట్టే బ్రెయిన్‌బ్రిడ్జ్‌ వీడియోపై మిక్స్‌డ్‌ రియాక్షన్స్‌ వస్తున్నాయి.

Updated On 23 May 2024 6:34 AM GMT
Ehatv

Ehatv

Next Story