Sebi rules on Pan,Aadhar : పాన్ కార్డ్ అప్డేట్ చేయకుంటే తీవ్ర చర్యలు తప్పవు.!
పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇప్పుడు మనకున్నముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఇది అత్యంత ముఖ్యమైనవి . ఇవి గుర్తింపు కార్డులుగా, ఇతర లావాదేవీలకు కూడా కీలక డాక్యుమెంట్లుగా ఉపయోగపడతాయి. ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డు తప్పనిసరి. అయితే ఈ పాన్ కార్డు గురించి సెబీ కీలక ప్రకటన చేసింది.
పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇప్పుడు మనకున్నముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఇది అత్యంత ముఖ్యమైనవి . ఇవి గుర్తింపు కార్డులుగా, ఇతర లావాదేవీలకు కూడా కీలక డాక్యుమెంట్లుగా ఉపయోగపడతాయి. ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డు తప్పనిసరి. అయితే ఈ పాన్ కార్డు గురించి సెబీ కీలక ప్రకటన చేసింది. మార్చి 31, 2023, వరకు పాన్ కార్డు కలిగి ఉన్న వ్యక్తులు.. దానిని కచ్చితంగా ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలని సూచించింది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఈ విషయంలో నిర్లక్షం చేస్తే గనకు పాన్ కార్డు పనిచేయదని, ఇన్‌కంటాక్స్ యాక్ట్ 1961 కింద అలాంటి వారిపై తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించింది . ఇక ఇన్వెస్టర్లంతా ఈ పనిని మార్చి చివరి కల్లా పూర్తి చేయాలని చెప్పిందీ స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ. ఇక ఇలా చేస్తేనే స్టాక్ మార్కెట్ లో ఎలాంటి ట్రాన్సాక్షన్లు అయినా.. ఎలాంటి అవాంతరాలు లేకుండా చేసుకోవచ్చని వెల్లడించింది. ఇక స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు డీమ్యాట్ ఖాతా ఓపెన్ చేయాలనుకుంటే.. ఆధార్, పాన్ కార్డు అనేవి తప్పనిసరి అనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సెబీ ఇప్పుడు ఒక సర్క్యులర్ జారీ చేసింది.
గత సంవత్సరం సీబీడీటీ (సెంట్రల్ డైరెక్ట్ టాక్సెస్ బోర్డ్) ఇష్యూ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. 2023, మార్చి 31 కల్లా పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలి. లేనిచో పాన్ కార్డు పనిచేయదు. పైగా వారిపై చర్యలు ఉంటాయి. "స్టాక్ మార్కెట్లలో లావాదేవీలకు సంబంధించి ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు .. మదుపరులు అంతా పాన్‌కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానం చేయాలి. లేనిచో పాన్ కార్డు నిరుపయోగంగా మారిపోతుంది. అలాగే ఆ ఇన్వెస్టర్లను నాన్- KYC పూర్తి చేయని వారిగా భావించి.. వారి వారి ట్రాన్సాక్షన్లపై పరిమితులు విధిస్తాం." అని సెబీ ఒక ప్రకటనలో తెలిపింది. అసలు గడువు ఎప్పుడో ముగిసినా.. ఆలస్య రుసుముతో ఈ మార్చి 31 వరకు ఆదాయపు పన్ను శాఖ గడువు విధించింది. ఇప్పుడు పాన్ కార్డు, ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలటే రూ. 1000 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.