Russia LUNA 25 : 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి రష్యా రాకెట్ ప్రయోగం
దాదాపు ఐదు దశాబ్దాల తరువాత చంద్రుడి పైకి రష్యా(Russia) మళ్లీ “లూనా 25”(Luna 25) పేరుతో రాకెట్‌ను ప్రయోగించింది. ఆ దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్‌కాస్మోస్(Roscosmos) విడుదల చేసిన ప్రకటన ప్రకారం, మాస్కోకు తూర్పున 3,450 మైళ్ల దూరం లోని వోస్తోక్నీ కాస్మోడ్రోమ్(Vostochny Cosmodrome) ప్రాంతం నుంచి శుక్రవారం వేకువ జామున 2.10 గంటలకు ‘లునా 25’ నింగి లోకి దూసుకెళ్లింది.
దాదాపు ఐదు దశాబ్దాల తరువాత చంద్రుడి పైకి రష్యా(Russia) మళ్లీ “లూనా 25”(Luna 25) పేరుతో రాకెట్‌ను ప్రయోగించింది. ఆ దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్‌కాస్మోస్(Roscosmos) విడుదల చేసిన ప్రకటన ప్రకారం, మాస్కోకు తూర్పున 3,450 మైళ్ల దూరం లోని వోస్తోక్నీ కాస్మోడ్రోమ్(Vostochny Cosmodrome) ప్రాంతం నుంచి శుక్రవారం వేకువ జామున 2.10 గంటలకు ‘లునా 25’ నింగి లోకి దూసుకెళ్లింది. విశేషమేమిటంటే కేవలం ఐదు రోజుల్లోనే ‘లునా 25’ చంద్రుడి కక్షలోకి(orbit of the moon) చేరనుంది.
ఇంతవరకు చంద్రుడిపై(Moon) ఎవరూ చేరని దక్షిణ ధ్రువంలో మరో వారం రోజుల్లో ల్యాండర్ దిగేలా ప్రయోగం చేపట్టారు. అన్నీ అనుకూలంగా జరిగితే ఆగస్టు 21న ల్యాండర్ చంద్రుడిపై అడుగు పెట్టనున్నట్టు రోస్‌కాస్మోస్ అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత ఏడాది పాటు ఇది చంద్రునిపై పరిశోధనలు జరపనుంది. 1976 తర్వాత రష్యా చేపట్టిన తొలి లూనార్ ల్యాండర్ ప్రయోగం ఇదే కావడం విశేషం. ఇప్పటివరకు ఏ దేశ అంతరిక్ష నౌక కూడా చేరుకోని చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 ద్వారా సాఫ్ట్ ల్యాండింగ్ చేసి చరిత్ర సృష్టించాలని భావిస్తోన్న ఇస్రోకు లునా 25 ప్రయోగంతో రష్యా పోటీ ఇవ్వనుంది.
చంద్రయాన్ 3 చంద్రుని దక్షిణ ధ్రువంపై ఆగస్టు 23న ల్యాండ్ కానుండగా, అంతకంటే ముందే రష్యా పంపిన లునా 25 అక్కడే అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే లునా 25 ల్యాండర్ మిషన్ కేవలం 30 కేజీల పేలోడ్‌ను మాత్రమే తీసుకెళ్తోంది. ఇందులో చంద్రుడిపై మట్టిని సేకరించేందుకు అవసరమయ్యే రోబోటిక్ చేతులు, డ్రిల్లింగ్ మిషన్ తో పాటు ఇతర పరికరాలు ఉన్నాయి.
చంద్రయాన్3 కి ఇబ్బందులుంటాయా?
చంద్రుడి దక్షిణ ధ్రువంలో భారీగా మంచు ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అక్కడ ల్యాండింగ్ సవ్యంగా జరిగితే ఆక్సిజన్, నీరు వంటి వాటిపై సమాచారం సేకరించే అవకాశం లభిస్తుంది. ఈ క్రమం లోనే దక్షిణ ధ్రువంపై ఆగస్టు 23 కంటే ముందే లునా 25 ల్యాండర్ దిగితే అక్కడ అడుగుపెట్టిన తొలి దేశంగా రష్యా చరిత్ర సృష్టించనుంది. అయితే చంద్రయాన్ 3(chandrayan 3) , లునా 25 రెండూ ద క్షిణ ధ్రువంపై ల్యాండ్ అయితే అవి ఢీకొనే ప్రమాదం ఉందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే దీనిపై రష్యా స్పష్టతనిచ్చింది. ఈ రెండు అంతరిక్షసంస్థలు ల్యాండింగ్ చేయాలనుకున్న ప్రాంతాలు వేర్వేరని, అందువల్ల అవి ఢీకొనే అవకాశం లేదని వెల్లడించింది. ఇక చంద్రయాన్ 3 లో ల్యాండర్, రోవర్ ప్రొపల్షన్ మాడ్యూల్స్ ఉన్నాయి. గతంలో చంద్రయాన్ 2 ప్రయోగం సందర్భంగా ఇస్రో పంపించిన ఆర్బిటర్ ఇంకా కక్షలో తిరుగుతోంది. చంద్రయాన్ 3 కి కూడా ఇదే ఆర్బిటర్‌ను వినియోగించుకోనున్నారు. ఇక చంద్రయాన్3 పంపే ల్యాండర్ చంద్రుడిపై 14 రోజుల పాటు పరిశోధనలు చేయనుంది. రష్యా పంపే లునా 25 ఏడాదిపాటు జాబిల్లి ఉపరితలంపై పనిచేయనుంది.