బెంగళూరు కి చెందిన START UP సంస్థ " రివర్ " తమ మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్ లోకి విడుదలచేసింది . ఇండి(INDI) అనే పేరుతో వచ్చిన ఈ ఇ -స్కూటర్ ధర కాస్త ఎక్కువే 1. 25 లక్షలు . రాబోయే ఆగష్టు నెల నుండి వీటి అమ్మకాలు మొదలు కాబోతున్నాయి. దీని ఫీచర్స్ ,ఎబిలిటీ గురించి చూద్దాం. 4KWh బాటరీ సామర్థ్యం కలిగిన ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒక్కరి ఛార్జ్ చేస్తే […]

బెంగళూరు కి చెందిన START UP సంస్థ " రివర్ " తమ మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్ లోకి విడుదలచేసింది . ఇండి(INDI) అనే పేరుతో వచ్చిన ఈ ఇ -స్కూటర్ ధర కాస్త ఎక్కువే 1. 25 లక్షలు . రాబోయే ఆగష్టు నెల నుండి వీటి అమ్మకాలు మొదలు కాబోతున్నాయి. దీని ఫీచర్స్ ,ఎబిలిటీ గురించి చూద్దాం.

4KWh బాటరీ సామర్థ్యం కలిగిన ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒక్కరి ఛార్జ్ చేస్తే 120 కిలో మీటర్ల వరకు ప్రయాణిస్తుంది . ఈ స్కూటర్ లో ప్రీలోడెడ్ వెర్షన్ లో భాగం గా ఎకో ,రైడ్ ,రష్ వంటి మూడు రకాల రైడింగ్ మోడ్స్ లు అందుబాటులో ఉన్నాయి . ఇది 90 KM ల గరిష్ట వేగాన్ని కలిగిఉన్న బైక్ ఇది . కంపెనీ ఇండి ని స్కూటర్లలో SUV గా పేర్కొంది . దాదాపు 5 గంటలు ఛార్జింగ్ పెడితే 80% బాటరీ ని కలిగి ఉంటుంది . స్కూటర్ కి ,బాటరీ కి దాదాపు 5 సంవత్సరాల వారెంటీ లభిస్తుంది.

ఈ ఇ -స్కూటర్ ముందు భాగం మిగిలిన స్కూటర్ డిజైన్ కన్నా కాస్త విభిన్నంగా ఉండొబోతుంది . న్యూ లుక్ తో రాబోతున్న ఈ స్కూటర్ బుకింగ్స్ ని కేవలం 1250 రూ ల కే అందుబాటులో ఉంది . కంపెనీ రిజిస్టర్డ్ వెబ్సైటు నుండి ప్రీ బుకింగ్ ని అమలులో కి తీసుకువచ్చింది . పూర్తి డబ్బులు చెల్లించాకే డెలివరీ ఉంటుంది. ఇప్పటికే బుకింగ్స్ అనేవి మొదలు అయ్యాయి.

Updated On 27 Feb 2023 7:56 AM GMT
Ehatv

Ehatv

Next Story