మే 1, 2025 నుంచి భారతదేశంలో టోల్ కలెక్షన్ విధానంలో సంచలనాత్మక మార్పు అమలులోకి రానుంది.

మే 1, 2025 నుంచి భారతదేశంలో టోల్ కలెక్షన్ విధానంలో సంచలనాత్మక మార్పు అమలులోకి రానుంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) ఫాస్టాగ్ స్థానంలో జీపీఎస్‌(GPS) ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్‌ను ప్రవేశపెడుతోంది. ఈ కొత్త విధానంతో పారదర్శకమైన టోల్ వసూళ్లు రానున్నాయి. రద్దీని తగ్గించడానికి ఈ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దశల వారీగా జాతీయ రహదారులపై ఫాస్టాగ్‌ను ఎత్తివేయనుంది. వాహనాల్లో ఫ్యాక్టరీ-ఫిట్ లేదా రెట్రోఫిట్ GPS డివైస్‌లతో అమర్చుతారు. ఈ సిస్టమ్ వాహనం ప్రయాణించిన దూరం ఆధారంగా టోల్‌ను లెక్కిస్తుంది, ఫలితంగా సరసమైన ఛార్జీలు వసూలు చేస్తారు. టోల్ బూత్‌ల వద్ద ఆగకుండా సీమ్‌లెస్ పేమెంట్ సాధ్యమవుతుంది, ఇది ట్రాఫిక్ జామ్‌లను తగ్గిస్తుంది. ప్రైవేట్ వాహన యజమానులు రోజుకు మొదటి 20 కిలోమీటర్లు నేషనల్ హైవేలపై టోల్ రహితంగా ప్రయాణించవచ్చు. ప్రస్తుత ఫాస్టాగ్ వినియోగదారులకు ఈ కొత్త GPS సిస్టమ్‌కు మార్పు సులభంగానే ఉంటుంది. NHAI, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేల దీనికి సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేశాయి.

టోల్ బూత్‌ల వద్ద ఆగవలసిన అవసరం లేకపోవడం వల్ల ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. దూరం ఆధారంగా టోల్ ఛార్జీలు వసూలు కావడం వల్ల వినియోగదారుల నుంచి అంతే చార్జీ వసూలు చేస్తారు. టోల్ బూత్‌ల వద్ద వేచి ఉండే సమయం తగ్గడం వల్ల ఇంధన వృథా తగ్గుతుంది. తక్కువ ఇంధన వినియోగం వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయని కేంద్రం చెప్తోంది. వాహన యజమానులు తమ ఫాస్టాగ్ ఖాతాలను అప్‌డేట్ చేసుకోవాలి, కొత్త GPS సిస్టమ్‌కు మార్పు కోసం NHAI వెబ్‌సైట్ (https://nhai.gov.in) లేదా MoRTH మార్గదర్శకాలను చెక్‌ చేసుకోవాలి. టోల్ ఛార్జీలు, రూట్ సమాచారం కోసం అధికారిక NHAI వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచిస్తున్నారు.


వెబ్‌సైట్ https://nhai.gov.in

ehatv

ehatv

Next Story