NASA Mission-Asteroid 16 Psyche : బంగారంలాంటి గ్రహశకలం...భూమ్మీదకు తెస్తే ప్రజల జాతకాలు మారిపోతాయి...!
అంగారకుడు, బృహస్పతి మధ్యన ఉన్న ఓ భారీ గ్రహశకలంపై(Asteroid) అంతర్జాతీయ అంతరక్షి కేంద్రం (NASA) దృష్టి సారించింది. ఈ గ్రహశకలాన్ని 16 సైక్ అని పిలుస్తారు. ప్రస్తుతం నాసా అక్కడికి చేరుకోవడానికి ఉద్దేశించిన మిషన్‌పై పని చేస్తోంది. అక్కడికే ఎందుకు వెళ్లానుకుంటుంది? ఆ గ్రహశకలం ప్రత్యేకత ఏమిటి?
అంగారకుడు, బృహస్పతి మధ్యన ఉన్న ఓ భారీ గ్రహశకలంపై(Asteroid) అంతర్జాతీయ అంతరక్షి కేంద్రం (NASA) దృష్టి సారించింది. ఈ గ్రహశకలాన్ని 16 సైక్ అని పిలుస్తారు. ప్రస్తుతం నాసా అక్కడికి చేరుకోవడానికి ఉద్దేశించిన మిషన్‌పై పని చేస్తోంది. అక్కడికే ఎందుకు వెళ్లానుకుంటుంది? ఆ గ్రహశకలం ప్రత్యేకత ఏమిటి? అన్న క్యూరియాసిటీ మొదలయ్యింది కదూ! ఆ లోహ గ్రహశకలంలో పది వేల క్వాడ్రిలియన్ డాలర్ల విలువైన ఇనుము(Iron), నికెల్(Nickel), బంగారం ఉన్నాయట! క్వాడ్రిలియన్ అంటే మన కరెన్సీలో 7,44,045 రూపాయలు.
బంగాళాదుంప ఆకారంలో ఉన్న ఆ గ్రహశకలం వ్యాసం 140 మైళ్లు ఉంటుందంతే! అంటే 226 కిలోమీటర్లు అన్నమాట! మన చందమామ వ్యాసంలో దాదాపు 16వ వంతు! హైదరాబాద్- గుంటూరు మధ్య ఎంత దూరం ఉందో అంతన్నమాట! ఆ చిన్ని గ్రహశకలంపై ఉన్న బంగారం విలువ బిలియన్ డాలర్లు ఉంటుందట! గ్రహశకలాలు చాలా మట్టుకు రాతితోనో, మంచుతోనో నిండి ఉంటాయి. కానీ 16 సైక్ అందుకు భిన్నం. మృత గ్రహానికి చెందిన ఓపెన్ మెటాలిక్ హార్ట్‌గా దీన్ని భావిస్తున్నారు. ఈ గ్రహశకలంపై లభ్యమయ్యే పసిడిని పుడమికి తెచ్చి అందరికీ సమానగా పంచితే ప్రతి ఒక్కరూ కోటీశ్వరులు కావచ్చు.
1852, మార్చి 17న ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త అన్నీ బేల్ డి గ్యాస్పరిస్ ఈ గ్రహశకలాన్ని కనుగొన్నారు. గ్రీకు దేవత అయిన సైకీ పేరిట దీనికి సైక్ అని పేరు పెట్టారు. రోమన్లు ప్రణయదేవుడిని ఎరోస్ అంటారు. మన మన్మథుడులాంటి వాడు. ఓ చేపగా జన్మించిన సైకీ అతడిని పెళ్లి చేసుకుంటుంది. ఇది గ్రీకు పురాణ కథ. ఆ సంగతి పక్కన పెడితే సూర్యుడి చుట్టు తిరగడానికి సైక్‌కు సుమారు అయిదు సంవత్సరాలు పడుతుంది. సైక్ స్పేస్‌క్రాఫ్ట్ పరిశోధనను నిరుడు ఆగస్టులో నాసా ప్రారంభించింది. 2026లో ఈ గ్రహశకలాన్ని చేరుకోవచ్చని అనుకున్నారు. అయితే కొన్ని అవాంతర కారణాల వల్ల ఈ మిషన్ ఈ ఏడాదికి వాయిదా పడింది.."Written By : Senior Journalist M.Phani Kumar"