అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా(NASA) సూపర్ ఎర్త్(Super Earth) అనే గ్రహాన్ని కనుగొన్నది. ఇది భూమి కంటే 137 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇదే విషయాన్ని నాసా అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఈ సూపర్ ఎర్త్‌ అనే గ్రహం ఒక ఎర్రటి చిన్న నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తుందని తెలిపింది. ఖగోళ పరిణామాల ప్రకారం మనకు చాలా దగ్గరగా ఉంది. కేవలం 137 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా(NASA) "సూపర్ ఎర్త్"(Super Earth) అనే గ్రహాన్ని కనుగొన్నది. ఇది భూమి కంటే 137 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇదే విషయాన్ని నాసా అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఈ సూపర్ ఎర్త్‌ అనే గ్రహం ఒక ఎర్రటి చిన్న నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తుందని తెలిపింది. ఖగోళ పరిణామాల ప్రకారం మనకు చాలా దగ్గరగా ఉంది. కేవలం 137 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.
ఈ వ్యవస్థ రెండవ, భూమి-పరిమాణ గ్రహం కూడా ఉండే అవకాశం ఉందని తెలిపింది.

ఈ గ్రహానికి TOI-715 బి(TOI-715 B) అని పేరు పెట్టారు. ఇది భూమి కంటే ఒకటిన్నర రెట్లు వెడల్పుగా ఉంది. దాని పేరెంట్‌ నక్షత్రం చుట్టూ "సంప్రదాయ" నివాసయోగ్యమైన జోన్‌ కక్ష్యలో ఉంటుంది. నాసా ప్రకారం, దాని ఉపరితలంపై నీరు కూడా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఆశ్చరకరమేంటంటే ఈ గ్రహం ఒక సంవత్సరానికి సమానమైన పూర్తి కక్ష్యను కేవలం 19 రోజుల్లో పూర్తి చేస్తుంది. ప్రాథమిక కొలతలు, పరిశోధనలతో ఇది నివాస యోగ్యమైన గ్రహంగా నాసా భావిస్తోంది. భూమి కంటే కొంచె పెద్దదిగా సూర్యుడి కంటే చల్లగా ఉందని తెలిపింది. "సూపర్-ఎర్త్", భూమి కంటే పెద్దది కాని నెప్ట్యూన్ కంటే చిన్నగా ఉందని తెలిపింది. TOI-715 బిని గుర్తించడంలో ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ (TESS) కీలక పాత్ర పోషించింది.

Updated On 25 March 2024 6:19 AM GMT
Ehatv

Ehatv

Next Story