స్మార్ట్ ఫోన్ వినియోగంతో జరుగుతున్న దుష్పరిణామాలు మనం రోజు వార్తల్లో వింటూనే ఉన్నాం. ఎన్నో మానసిక రుగ్మతలు ,శారీరక సమస్యలు ,మొబైల్ వినియోగం తో పాటు పెరుగుతున్నాయి . కంటిచూపుకి సంధించిన సమస్యలు.నరాలకు సంధించిన ఎన్నో వ్యాధులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి. మొబైల్ ఫోన్స్ నుండి వెలువడే రేడియషన్ అత్యంత ప్రమాదకరం అని అది కేవలం మనుషుల మీద మాత్రమే కాదు .ప్రకృతి మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుంది . మనలో చాల మంది నిద్రపోయేటప్పుడు తల కింద,బెడ్ […]
స్మార్ట్ ఫోన్ వినియోగంతో జరుగుతున్న దుష్పరిణామాలు మనం రోజు వార్తల్లో వింటూనే ఉన్నాం. ఎన్నో మానసిక రుగ్మతలు ,శారీరక సమస్యలు ,మొబైల్ వినియోగం తో పాటు పెరుగుతున్నాయి . కంటిచూపుకి సంధించిన సమస్యలు.నరాలకు సంధించిన ఎన్నో వ్యాధులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి. మొబైల్ ఫోన్స్ నుండి వెలువడే రేడియషన్ అత్యంత ప్రమాదకరం అని అది కేవలం మనుషుల మీద మాత్రమే కాదు .ప్రకృతి మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుంది .
మనలో చాల మంది నిద్రపోయేటప్పుడు తల కింద,బెడ్ పైన మొబైల్ పక్కన పెట్టి నిద్రపోతాం . ఇది కూడా అత్యంత ప్రమాదకరం .రాత్రి సమయంలో ఇంట్లో వైఫై నిర్విరామం గా పనిచేస్తూ ఉంటే వాటి నుండి వచ్చే తరంగాల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది .మొబైల్ వాడకం లో కూడా కొన్ని జాగ్రత్తలు ఎప్పటికప్పుడు పాటిస్తూ ఉండాలి అవసరం లేని యాప్లను ఎప్పటికప్పుడు తొలగించటం వాళ్ళ బాటరీ సామర్థ్యం మెరుగ్గా ఉంటుంది . బాటరీ వేడి ఎక్కడం లాంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు .బయటదొరికే చౌక బారు ఛార్జర్లు ,బాటరీలను వాడకపోవడం మంచిది . వీటివల్ల మొబైల్ అనేది హీట్ ఎక్కడం ,త్వరగా పాడవుతుంది .
తాజాగా జరిగిన ఒక ఘటన మొబైల్ వినియోగ దారుల గుండెల్లో దడ పుట్టిస్తుంది . చాలా మంది మొబైల్ ఛార్జింగ్ లో ఉన్నపుడు ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. మధ్యప్రదేశ్ ఉజ్జయిని లో 68 ఏళ్ల ఒక వ్యక్తి మొబైల్ ఛార్జ్ పెట్టి మాట్లాడుతూ ఉండగా భారీ పేలుడు సంభవించి తల నుండి ఛాతి భాగం వరకు శరీరం కాలిపోయింది . ఫోన్ మాట్లాడుతున్న చెయ్యి ముక్కులు ముక్కలు గ తెగిపడింది . గతం లో కూడా ఇలాంటి సంఘటనలు మనం చాలా చూసాం .అందుకే మొబైల్ వాడేటప్పుడు సరైన జాగ్రత్తలు పాటించటం మర్చిపోవద్దు.