నిమిషం గాలి పీల్చకుండా అయిన ఉండగలమేమో కానీ క్షణం కూడా చేతిలో మొబైల్ లేకుండా ఉండే రోజులివి . అంతగా మొబైల్ ఫోన్స్ వినియాగం పెరిగింది. పక్కన ఎవరున్నా ,మనం ఎక్కడవున్నా అనవసరం మన చేతిలో ఫోన్ ఉంటే చాలు ఆ ప్రపంచంలోనే మునిగిపోతూఉంటాం .పక్కన వాడి చావు బ్రతుకుల్లో ఉన్న సహాయం చేయటం పక్కన పెట్టి సెల్ఫీలే లోకంగా బ్రతుకున్నారు జనం . స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా వీటి ప్రపంచం లో బ్రతుకుతున్న ఒక […]

నిమిషం గాలి పీల్చకుండా అయిన ఉండగలమేమో కానీ క్షణం కూడా చేతిలో మొబైల్ లేకుండా ఉండే రోజులివి . అంతగా మొబైల్ ఫోన్స్ వినియాగం పెరిగింది. పక్కన ఎవరున్నా ,మనం ఎక్కడవున్నా అనవసరం మన చేతిలో ఫోన్ ఉంటే చాలు ఆ ప్రపంచంలోనే మునిగిపోతూఉంటాం .పక్కన వాడి చావు బ్రతుకుల్లో ఉన్న సహాయం చేయటం పక్కన పెట్టి సెల్ఫీలే లోకంగా బ్రతుకున్నారు జనం .

స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా వీటి ప్రపంచం లో బ్రతుకుతున్న ఒక అమ్మాయి . 29 ఏళ్ళ వయసులో అంతుతెలియని ఆరోగ్య పరిస్థితుల్లో వీల్ చైర్ కి పరిమితం అయిపోయింది . స్మార్ట్ ఫోన్ వినియోగం వల్ల ఎదురయ్యే ఎన్నో దుష్ప్రయోజనాలు ,ఆరోగ్య సమస్యలు గురించి నిత్యం చూస్తూనే ఉన్నాం . అదే రీతీలో స్మార్ట్ ఫోన్ కి అతిగా అడిక్ట్ అవ్వటం వలెనే నాకు ఈ పరిస్థితి ఎదురయ్యింది అంటూ వాపోయింది యూకే కి చెందిన ఫెనెల్లా ఫాక్స్ రోజులో 14 గంటలు కి పైగా ఐపాడ్,ఐఫోన్ లో సోషల్ మీడియా లో స్క్రోలింగ్ చేస్తూ గడుపుతూ ఉండేది . మొదట్లో తలనొప్పి ,మైకం వంటివి తరచుగా వాస్తు ఉండేవి 2021 లో ఈ సమస్యలు తీవ్రం గా మారాయి . చివరకు వర్టిగో సమస్యతో నడవటం కూడా కష్టం అయ్యి వీల్ చైర్ కి పరిమితం కావాల్సి వచ్చింది .

ఈ విషయాన్ని స్వయంగా తానే సోషమీడియా ద్వారా పంచుకుంది . తనకు తెలియకుండానే జరిగిన ఏ పరిణామానికి పూర్తి భాద్యత తనదే అని . తన తల్లి తండ్రుల సహాయం తో నెమ్మదిగా కోలుకుంటున్నానని ,దాదాపు 6 నెలలు పాటు చలనం లేని స్థితి నుండి ఇప్పుడు మెరుగైన స్థితికి రావటం జరిగిందని పంచుకోండి ఫెనెల్ల . ఈ విషయం తెలిసాక అయినా స్మార్ట్ ఫోన్స్ వినియోగంతో మరింత జాగ్రత్తలు పెరుగుతాయనే ఆశిద్దాం .

Updated On 28 Feb 2023 5:14 AM GMT
Ehatv

Ehatv

Next Story