కొత్త కొత్త ఆవిష్కరణలకు జపాన్ ఎప్పుడూ ముందుంటుంది. రకరకాల ఎక్విప్మెంట్, మెషిన్లు తయారీలో జపాన్ అగ్రభాగాన ఉంటుంది.
కొత్త కొత్త ఆవిష్కరణలకు జపాన్ ఎప్పుడూ ముందుంటుంది. రకరకాల ఎక్విప్మెంట్, మెషిన్లు తయారీలో జపాన్ అగ్రభాగాన ఉంటుంది. ప్రతిరోజూ స్నానం చేయడానికి కొందరికి బద్దకం ఎక్కువ. కొందరైతే ఒక నాలుగైదు రోజుల వరకు స్నానం గురించి ఆలోచించరు. ఇటువంటివారిపై జపాన్ శాస్త్రవేత్తలు తమ ఉదారతను చాటుకున్నారు. ప్రతిరోజూ స్నానం చేసేందుకు బద్దకించే బద్దక జీవుల కోసం జపాన్(Japan)లోని ఓ కంపెనీ హ్యూమన్ వాషింగ్ మెషిన్ల(HumanWashingMachine)ను తయారు చేసింది. జపాన్‌లోని సైన్స్ కో అనే కంపెనీ ఈ యంత్రాన్ని తయారుచేసింది. జస్ట్ 15 నిమిషాల్లోనే మనకు ఈ మెషిన్ స్నానం చేపిస్తుంది. ఓ ఎక్స్‌పోలో ఈ హ్యూమన్ వాషింగ్ మెషీన్‌ను ఉంచిన సైన్స్ కో కంపెనీ.. దాన్ని ట్రై చేసేందుకు అవకాశం కల్పించింది.
ఒసాకాలోని కన్సాయి ఎక్స్‌పోలో ఈ హ్యూమన్ వాషింగ్ మెషిన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దాన్ని ఉపయోగించి స్నానం చేసిన వారు చెప్పిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా భారీ సంఖ్యలో ఈ హ్యూమన్ వాషింగ్ మెషీన్లను తయారు చేయనున్నట్లు సైన్స్ కో కంపెనీ ప్రకటించింది. ఈ హ్యూమన్ వాషింగ్ మెషిన్ చూడటానికి ఫైటర్‌జెట్ కాక్‌పిట్ ఆకారంలో ఉంటుంది. బయటినుంచి చూస్తే లోపల ఉన్న వ్యక్తులు కనిపించేలా ప్లాస్టిక్‌తో తయారు చేశారు. ఇందులోకి వెళ్లి ఆన్ చేసుకుంటే తొలుత సగానికైగా వేడి నీరు నింపుకుంటుంది. ఆ తర్వాత అందులో ఏర్పాటు చేసిన హైస్పీడ్ జెట్స్ నుంచి నీరు షవర్లలా వస్తుంది. ఆ నీటిలో 3 మైక్రోమీటర్ల సైజులో ఉండే చిన్నచిన్న నీటి బుడగలు వస్తాయి. ఈ నీటి బుడగలే మనిషి శరీరంపై ఉండే మురికిని తొలగించేందుకు ఉపయోగపడతాయి. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాయంతో పనిచేస్తుంటుంది. ఏఐ ద్వారా మనిషి మూడ్‌ను బట్టి ఈ యంత్రం ప్రవర్తిస్తుంది. మనిషి మూడ్ డల్‌గా ఉంటే ఉత్సాహపర్చేందుకు కూడా ఏర్పాట్లు చేశారు.