ఇస్రో శాస్త్రవేత్తలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ ప్రయోగం చివరి క్షణంలో ఆగిపోయింది. గగన్‌యాన్ మిషన్ టీవీ డీ1లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.

ISRO identifies and corrects issue, launch soon
ఇస్రో శాస్త్రవేత్తలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ ప్రయోగం(Gaganyaan Mssion) చివరి క్షణంలో ఆగిపోయింది. గగన్‌యాన్ మిషన్ టీవీ డీ1లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో.. ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని చివరి క్షణంలో హోల్డ్‌లో పెట్టారు. ఆ సాంకేతిక సమస్య ఏంటనే దానిపై శాస్త్రవేత్తలు పరిశీలన మొదలుపెట్టారు. త్వరలోనే మరో తేదీని ప్రకటిస్తామని ఇస్రో చైర్మన్ సోమనాథ్(ISRO Chairman Somanath) ప్రకటించారు.
గగన్‌యాన్ ప్రయోగానికి కేవలం నాలుగు సెకన్ల ముందు ఇస్రో శాస్త్రవేత్తలు మిషన్‌లో సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దాంతో ప్రయోగాన్ని హోల్డ్‌లో పెట్టినట్లు వెల్లడించారు. ప్రయోగానికి ముందు కూడా స్వల్పమార్పులు చోటుచేసుకున్నాయి. గగన్‌యాన్ కౌంట్‌డౌన్(Countdown) ప్రక్రియ శుక్రవారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభమైంది. ఉదయం 8.00 గంటలకు ఈ పరీక్ష జరగాల్సి ఉండగా.. అరగంట ఆలస్యంగా ప్రయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 8.30 గంటలకు ప్రయోగం నిర్వహించాల్సి ఉండగా.. చివరి క్షణంలో సాంకేతిక లోపంతో ఆగిపోయింది.
కాగా.. రోదసిలోకి సొంతంగా వ్యోమగాములను పంపేందుకు ఇస్రో గగన్‌యాన్ ప్రాజెక్టు చేపట్టింది. ‘టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్’ (టీవీ-డీ1) అనే పరీక్ష ద్వారా వ్యోమగాముల భద్రతకు సంబంధించిన వ్యవస్థ సమర్థతను విశ్లేషించాల్సి ఉంది. గగన్ యాన్ కు ముందు ఇస్రో నిర్వహించనున్న నాలుగు పరీక్ష్లల్లో టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ మొదటిది.
