5G నెట్‌వర్క్‌ను(Network) ప్రారంభించిన సంవత్సరం తర్వాత భారతదేశం 5G స్పీడ్ టాప్ 10లో నిలిచింది.. Speedtest.net సైట్ Ookla ప్రకారం, 2023లో లండన్ (UK), జపాన్ (Japan) వంటి దేశాలను భారత్ వెనక్కి నెట్టింది. సెప్టెంబర్ 2022 - ఆగస్టు 2023 మధ్య భారతదేశ స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్‌లో 72 స్థానాలు ఎగబాకడం గమనార్హం. గత ఏడాది అక్టోబర్ 1న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) 5జీ సేవలను ప్రారంభించారు. భారతదేశంలోని 13 నగరాల్లో ఈ సేవలు ప్రారంభమయ్యాయి

2023 Q3లో 5G పనితీరులో ఫస్ట్ ర్యాంక్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), రెండో ర్యాంక్ దక్షిణ కొరియా (South Korea). క్వార్టర్ 3లో 312.26 Mbps 5G డౌన్‌లోడ్ వేగంతో 10వ స్థానంలో భారత్ నిలిచింది. గతేడాది అంఒటే 2022లో 312.09 Mbpsతో బ్రెజిల్ (Brazil) ఉన్న పదో స్థానంలో భారత్ నిలిచింది. ఇదే సమయంలో, ఈసారి బ్రెజిల్ 5G డౌన్‌లోడ్ వేగం443.93 Mbpsతో ఐదో స్థానంలో నిలిచింది
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దక్షిణ కొరియా 592.01 Mbps, 507.59 Mbpsతో అత్యంత వేగవంతమైన 5G డౌన్‌లోడ్ స్పీడ్‌లను కలిగి ఉన్న దేశాలుగా నిలిచాయి. 485.24 Mbps డౌన్ లోడ్ స్పీడ్‌తో మలేషియా (Malaysia) మూడో స్థానంలో నిలిచింది. మలేషియా తర్వాత ఖతార్ (Qatar), బ్రెజిల్, డొమినికన్ రిపబ్లిక్ (Dominican Republic), ఏడో స్థానంలో కువైట్ (Kuwait), ఎనిమిదో స్థానంలో మకావు (Macao), తొమ్మిదో స్థానంలో సింగపూర్ (Singapore) ఉన్నాయి.