ఇంటర్నెట్‌ను(Internet) వినియోగిస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండండి. లేకపోతే అకిరా వస్తుంది. అకిరా మీ సిస్టమ్‌ను హ్యాక్‌ చేయవచ్చు. అకిరా ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ రాన్సమ్‌వేర్‌(Ransomware) సాయంతో సైబర్‌ నేరగాళ్లు విండోస్‌ లైనెక్స్‌(Window Linux) ఆధారిత సిస్టమ్స్‌ను హ్యాక్‌ చేస్తున్నారు. అలా హ్యాక్‌(Hack) చేసి వ్యక్తిగత సమాచారాన్ని దొంగలిస్తున్నారు. ఆ సమాచారాన్ని ఎన్‌క్రిప్ట్ చేసి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇంటర్నెట్‌ను(Internet) వినియోగిస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండండి. లేకపోతే అకిరా వస్తుంది. అకిరా మీ సిస్టమ్‌ను హ్యాక్‌ చేయవచ్చు. అకిరా ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ రాన్సమ్‌వేర్‌(Ransomware) సాయంతో సైబర్‌ నేరగాళ్లు విండోస్‌ లైనెక్స్‌(Window Linux) ఆధారిత సిస్టమ్స్‌ను హ్యాక్‌ చేస్తున్నారు. అలా హ్యాక్‌(Hack) చేసి వ్యక్తిగత సమాచారాన్ని దొంగలిస్తున్నారు. ఆ సమాచారాన్ని ఎన్‌క్రిప్ట్ చేసి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు. సైబర్‌ స్పేస్‌లో అకిరా ఇప్పటికీ చాలా యాక్టివ్‌గా ఉందని ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌(Indian Computer Emergency Response Team) హెచ్చరిస్తోంది. తెలంగాణలో రాన్సమ్‌వేర్‌ ప్రభావం అంతగా లేదని చెబుతున్నా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.

ఎనీ డెస్క్‌, విన్‌రార్‌, పీసీ హంటర్‌ వంటి వాటి ద్వారా రాన్సమ్‌వేర్‌ వ్యాప్తి చెందుతున్నదట! కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ రాన్సమ్‌వేర్‌ను అడ్డుకోవచ్చు. ఆపరేటింగ్‌ సిస్టమ్‌ తోపాటు సాఫ్ట్‌వేర్లు, వెబ్‌బ్రౌజర్లు, ఇతర అప్లికేషన్లను క్రమం తప్పకుండా అప్‌డేట్‌ చేసుకోండి. యాంటీ వైరస్‌లతో సిస్టమ్స్‌ను తరచుగా క్లీన్‌ చేసుకోవడం మంచిది. అందుకోసం మంచి కంపెనీల యాంటీ వైరస్‌, యాంటీ మాల్వేర్‌ సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించండి. ఈ-మెయిళ్లతోపాటు వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, టెలిగ్రామ్‌కు మెసేజ్‌ల ద్వారా వచ్చే లింకులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలియనివారి నుంచి వచ్చే మెయిల్‌ అటాచ్‌మెంట్లను ఎట్టి పరిస్థితులలో ఓపెన్‌ చేయకండి. బ్రౌజింగ్‌ విషయంలో అప్రమత్తంగా ఉండండి. తెలియని వెబ్‌సైట్లను ఓపెన్‌ చేసినప్పుడు అనుమానాస్పద ప్రకటనలను క్లిక్‌ చేయకండి. బలమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించడం మంచిది. మీ ఈ-మెయిల్‌, సోషల్‌ మీడి యా అకౌంట్లకు రెండంచెల వెరిఫికేషన్‌, అథంటికేషన్‌ ఉండేలా చూసుకోండి. లేకపోతే ఫోన్‌కు ఓటీపీ వచ్చేలా సెట్టింగ్స్‌ మార్చుకోండి. డాటాను క్రమం తప్పకుండా బ్యాకప్‌ చేసుకుని పెన్‌డ్రైవ్‌ లేదా సురక్షితమైన క్లౌడ్‌ సర్వీస్‌లో నిల్వ చేసుకోవడం శ్రేయస్కరం. అప్పుడు మన డాటా సురక్షితంగా ఉంటుంది. ఆన్‌లైన్‌ నేరాలతోపాటు సైబర్‌ సెక్యూరిటీపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోండి.. ఈ జాగ్రత్తలు పాటిస్తే రాన్సమ్‌వేర్‌ నుంచి తప్పించుకోవచ్చు.

Updated On 26 July 2023 2:44 AM GMT
Ehatv

Ehatv

Next Story