క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ను (Creta Facelift) ₹11 లక్షల ప్రారంభ ధరతో హ్యుందాయ్ (Hyndai) కొత్త కారును విడుదల చేసింది. క్రెటా ఫేస్‌లిఫ్ట్ బేసిక్‌ వేరియంట్ ₹10.99 లక్షల (ఎక్స్-షోరూమ్ ధర) నుంచి టాప్-ఎండ్ వేరియంట్ ధర ₹17.24 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు దీని ధరలు ఉన్నాయి

క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ను (Creta Facelift) ₹11 లక్షల ప్రారంభ ధరతో హ్యుందాయ్ (Hyndai) కొత్త కారును విడుదల చేసింది. క్రెటా ఫేస్‌లిఫ్ట్ బేసిక్‌ వేరియంట్ ₹10.99 లక్షల (ఎక్స్-షోరూమ్ ధర) నుంచి టాప్-ఎండ్ వేరియంట్ ధర ₹17.24 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు దీని ధరలు ఉన్నాయి. 2015లో క్రెటాను ప్రవేశపెట్టినప్పటి నుంచి దాదాపు తొమ్మిదేళ్లలో 9.80 లక్షలకు పైగా కస్టమర్లను సొంతం చేసుకుంది. మిడ్-సైజ్ SUV సెగ్మెంట్లో బలమైన పోటీని ఎదుర్కొంటున్నప్పటికీ క్రెటా తన డామినేషన్‌ కొనసాగింది.

తాజాగా క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ పేరుతో కొత్త కారును మార్కెట్లోకి తెచ్చింది. ఎక్స్‌టీరియర్‌, ఇంటీరియర్ డిజైన్‌లో మార్పులు, చేర్పులు చేసింది. లెవెల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS)ను ఇందులో చేర్చింది. క్రెటా 1.5-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ టర్బో-పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో సహా మూడు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో అందుబాటులోకి తెచ్చింది. ఆరు గేర్లతో మాన్యువల్, ఆరు గేర్లతో iMT, ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్, CVT 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్ ఆప్షన్స్‌లో లభిస్తుంది.

దీనిలో రీడిజైన్ గ్రిల్, కొత్త LED హెడ్‌లైట్లు, కొత్త LED DRL స్ట్రిప్‌తో సహా కారు బయట, లోపలి భాగాల్లో అనేక మార్పులు ఉన్నాయి. క్రెటా ఫేస్‌లిఫ్ట్‌లో అలయ్‌ వీల్స్‌, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి. 2024 హ్యుందాయ్ క్రెటా ఇప్పుడు కొత్త రోబస్ట్ ఎమరాల్డ్ పెరల్ వేరియంట్‌తో సహా ఆరు రంగుల్లో అందుబాటులో ఉంది. ఫైరీ రెడ్, రేంజర్ ఖాకీ, అబిస్ బ్లాక్, అట్లాస్ వైట్, టైటాన్ గ్రే, అట్లాస్ వైట్ విత్ బ్లాక్ రూఫ్ రంగుల్లో అందుబాటులోకి దీనిని హ్యూందాయ్‌ కంపెనీ తీసుకొచ్చింది.

Updated On 16 Jan 2024 6:01 AM GMT
Ehatv

Ehatv

Next Story