ప్రపంచంలో టెక్నాలజీ పెరిగిపోయింది. అరచేతిలో ప్రపంచాన్ని వీక్షిస్తున్నాం. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో వాటికి సంబంధించిన సమాచారం మనకు ఈ టెక్నాలజీ చేరవేసింది. ప్రపంచమే కుగ్రామంగా మారిపోయింది. అయితే టెక్నాలజీ ఎంత స్మార్ట్‌గా మారిందో అంతే స్మార్ట్‌గా నకిలీ వెబ్‌సైట్లు పుట్టుకొస్తున్నాయి.

ప్రపంచంలో టెక్నాలజీ పెరిగిపోయింది. అరచేతిలో ప్రపంచాన్ని వీక్షిస్తున్నాం. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో వాటికి సంబంధించిన సమాచారం మనకు ఈ టెక్నాలజీ చేరవేసింది. ప్రపంచమే కుగ్రామంగా మారిపోయింది. అయితే టెక్నాలజీ ఎంత స్మార్ట్‌గా మారిందో అంతే స్మార్ట్‌గా నకిలీ వెబ్‌సైట్లు పుట్టుకొస్తున్నాయి. ఈ నకలీ వెబ్‌సైట్ల మాయలో పడి మోసాలు జరుగుతున్నాయి. గతంలో తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(Cyber Security Bureau) కొంత ఈ నకిలీ వెబ్‌సైట్లను(Fake websites) అరికట్టినా కానీ నకిలీ వెబ్‌సైట్ల పరంపర కొనసాగుతూనే ఉంది. ఎంతోమంది నకిలీ వెబ్ సైట్- ఒరిజినల్ వెబ్ సైట్ మధ్య తేడాను గుర్తించలేక సైబర్ వలలో చిక్కుకుంటున్నారు. ఏదైనా వెబ్ సైట్స్ ను చూస్తే అది ఒరిజినలా లేదంటే నకిలీదా అనేది గుర్తించాలని సాంకేతిక నిపుణులు చెప్తున్నారు.

ఏదైనా ఒక వెబ్ సైట్ ఓపెన్ చేయాలంటే ముందుగా ఆ వెబ్ సైట్‌కు సంబంధించిన అడ్రస్ డొమైన్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. వెబ్ సైట్ పేరు చివర్లో .com, .org, .gov, edu ఉంటాయి. అయితే నకిలీ డొమైన్ పేర్లు కొంచెం తప్పుగా ఉంటాయి. వెబ్ సైట్ URLలో కచ్చితంగా దీనికి ముందు HTTP అని ఉంటుంది. అలా ఉంటేనే అది ఒరిజినల్ వెబ్ సైట్ అవుతుందని.. లేదంటే నకిలీ వెబ్ సైట్ అని నిపుణులు చెప్తున్నారు. వెబ్ సైట్‌పై క్లిక్‌ చేసిన వెంటనే మరో వెబ్ సైట్‌కు రూట్‌ వెళ్తే అది కచ్చితంగా అది నకిలీ వెబ్ సైట్ ఉండొచ్చు అని చెప్పారు. ఇలాంటి వెబ్‌సైట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అసలు సైట్లను గుర్తించాలంటే వాటిని ఓపెన్ చేస్తే About US, Contact పేజీలు కనిపిస్తాయి. నకిలీ వెబ్‌సైట్లలో ఇలాంటివి ఉండవు. దీంతో ఇది ఫేక్ వెబ్ సైట్‌గా గుర్తించాలి. అంతేకాకుండా WEB OF TRUST అనే వెబ్ సైట్ ను ఉపయోగించి కూడా నకిలీ వెబ్ సైట్లను గుర్తించవచ్చు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ కు ఈ వెబ్ సైట్లు యాడ్ చేసుకుంటే.. ఏదైనా వెబ్ ఓపెన్ చేస్తే దానిపై గ్రీన్ కనిపిస్తే ఒరిజినల్ అని, రెడ్ మార్క్ కనిపిస్తే నకిలీ వెబ్ సైట్ గుర్తించే అవకాశం ఉంది. అనుమానాస్పద వెబ్ లింకులు, ఫోన్ నెంబర్లతో వచ్చే సందేశాలపై ఫిర్యాదు చేసేందుకు 8712672222 వాట్సాప్ నంబర్ ఉంది దీనికి.. పౌరులు లింకులతో కూడిన సందేశాలను ఈ నంబరుకు పంపిస్తే వాటిని పరిశీలించి నకిలీవని తేలితే శాశ్వతంగా నిలిపివేస్తారని నిపుణులు సూచిస్తున్నారు.

Updated On 14 Feb 2024 1:54 AM GMT
Ehatv

Ehatv

Next Story