ప్రస్తుతం చాలా మంది డ్యుయల్ సిమ్(Dual sim) ఉపయోగించడం సర్వసాధారణంగా మారిపోయింది. ఒక్కొక్కరి వద్ద డబుల్ సిమ్స్ ఉంటాయి. అంతేకాదు.. కొంతమంది మూడు లేదా నాలుగు సిమ్‌లు వాడుతున్నారు. చాలా మంది వ్యక్తిగత సిమ్ లేదా అత్యవసర పరిస్థితుల్లో ఉంచిన సిమ్‌ని రీఛార్జ్ చేయరు . మొబైల్ రీచార్జ్(Mobile Recharge) ధర విపరీతంగా పెరగడం ఇందుకు ఒక కారణం అనుకోవచ్చు. అలాగే ఒకే సిమ్ కు మాత్రమే రిఛార్జ్ చేయిస్తారు.
ప్రస్తుతం చాలా మంది డ్యుయల్ సిమ్(Dual sim) ఉపయోగించడం సర్వసాధారణంగా మారిపోయింది. ఒక్కొక్కరి వద్ద డబుల్ సిమ్స్ ఉంటాయి. అంతేకాదు.. కొంతమంది మూడు లేదా నాలుగు సిమ్‌లు వాడుతున్నారు. చాలా మంది వ్యక్తిగత సిమ్ లేదా అత్యవసర పరిస్థితుల్లో ఉంచిన సిమ్‌ని రీఛార్జ్ చేయరు . మొబైల్ రీచార్జ్(Mobile Recharge) ధర విపరీతంగా పెరగడం ఇందుకు ఒక కారణం అనుకోవచ్చు. అలాగే ఒకే సిమ్ కు మాత్రమే రిఛార్జ్ చేయిస్తారు. కానీ ఇలా రీఛార్జ్ చేయకుండా సిమ్ వదిలేస్తే కంపెనీ బ్లాక్ చేస్తుంది. ఆ తర్వాత ఆ నంబర్ వేరొకరికి ఇస్తారు.
టెలికాం(Telecom) నియమం ప్రకారం, నిర్దిష్ట వ్యవధిలోపు సిమ్ రీఛార్జ్ చేయకపోతే, ఆ నంబర్ మరొక వ్యక్తికి ట్రాన్స్ ఫర్ చేయబడుతుంది. అయితే చాలా మంది తమ మొబైల్ నంబర్‌ను పోగొట్టుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే, కొంతమందికి ఆ నంబర్ ప్రత్యేకమైనది లేదా ముఖ్యమైన పని కోసం ఉపయోగిస్తారు. కాబట్టి మీ సిమ్‌ని రీఛార్జ్ చేయకపోతే కంపెనీ ఎన్ని రోజులలో మరొకరికి నంబర్‌ను ఇస్తుందో తెలుసుకుందామా.
మీరు మీ సిమ్‌ని రీఛార్జ్ చేయకుంటే ఆ సిమ్ నంబర్‌ను వేరొకరికి ఇవ్వడానికి ముందు కంపెనీలు అనేక ముఖ్యమైన పనులు చేస్తాయి. ముందుగా మీరు 60 రోజుల పాటు సిమ్‌ని రీఛార్జ్ చేయనప్పుడు అది డియాక్టివేట్ చేయబడుతుంది. దీని తరువాత రీఛార్జ్ చేయడానికి 6 నుండి 9 నెలల వ్యవధి ఇవ్వబడుతుంది. ఈ సందర్భంలో నంబర్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు. మళ్లీ దానిని ఉపయోగించవచ్చు.
ఆ తర్వాత కూడా మీరు సిమ్‌ని ఉపయోగించకపోతే, కంపెనీ అనేక హెచ్చరికలు జారీ చేస్తుంది. చివరగా కంపెనీ సిమ్ బ్లాకింగ్ ప్రక్రియను ప్రారంభిస్తుంది. కొన్ని నెలల తర్వాత ఈ సిమ్ నంబర్ మరొక వినియోగదారుకు ట్రాన్స్ ఫర్ చేస్తారు. ఈ ప్రక్రియ దాదాపు ఒక సంవత్సరం పడుతుంది. అంటే ఒకరి నుంచి మరొకరికి సిమ్‌ను బదిలీ చేయడానికి ఏడాది సమయం పడుతుంది.