గగనాంతర రోదసిలో మనిషి ప్రయాణం సాగుతోంది. గ్రహరాశులను ఎప్పుడో అధిగమించిన మానవుడు ఘనతారల పథంవైపుకు సాగుతున్నాడు. అంతరిక్ష(Space) రహస్యాలను ఛేదిస్తున్నాడు. అమెరికా(America), రష్యా వ్యోమగాములు చంద్రుడిపై కాలుపెట్టారు.

గగనాంతర రోదసిలో మనిషి ప్రయాణం సాగుతోంది. గ్రహరాశులను ఎప్పుడో అధిగమించిన మానవుడు ఘనతారల పథంవైపుకు సాగుతున్నాడు. అంతరిక్ష(Space) రహస్యాలను ఛేదిస్తున్నాడు. అమెరికా(America), రష్యా వ్యోమగాములు చంద్రుడిపై కాలుపెట్టారు. మరోవైపు మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌కు(Gaganyan) భారత్‌ కూడా సన్నాహాలు చేస్తున్నది. 2025లో చంద్రుడిపైకి ఓ బృందాన్ని పంపాలని నాసా(NASA) ప్రణాళికలు రచిస్తున్నది. ఏమో.. భవిష్యత్తులో అమెరికాకు వెళ్లి వచ్చినట్టుగానే చంద్రుడి మీదకు కూడా వెళ్లి వచ్చేసే రోజులు వస్తాయేమో! అంతరిక్షంలోకి స్పెస్ షిప్‌లు ఎడా పెడా వెళ్లి వచ్చేస్తాయేమో!

సరే..వినడానికి ఇది చాలా బాగుంది.. కానీ అంతరిక్షంలో దురదృష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం జరిగి వ్యోమగాములు(Astronauts) మరణిస్తే.. అంతరిక్ష యాత్రికులు జబ్బులతో కన్నుమూస్తే అప్పుడేమిటి పరిస్థితి? వారి మృతదేహాలను ఏం చేస్తారు? అంతరిక్షంలోనే వదిలేసి వస్తారా? ఈ సందేహాలు రాకుండా ఉండవు. అంతర్జాతీయ స్పెస్‌ స్టేషన్‌ వంటి తక్కువ ఎత్తులోని కక్ష్య దగ్గర వ్యోమగాములు చనిపోతే ఆ మృతదేహాలను ప్రత్యేక క్యాప్సుల్‌(Capsules) ద్వారా రోజుల భూమికి తిరిగి తీసుకువచ్చే అవకాశం వుంది.

అంతరిక్షంలోకి ప్రయాణం ప్రారంభమయ్యాక భూమికి దగ్గరగా ఉన్న కక్ష్యలో ఎవరైనా చనిపోతే వారి మృతదేహలను స్పేస్‌ క్యాప్సుల్‌ ద్వారా భూమికి తీసుకురావచ్చు. అందులో మృతదేహాన్ని భద్రపరిచేందుకు ప్రత్యేక గతి ఉంటుంది. శరీరానికి కావాల్సిన స్థిరమైన టెంపరేచర్‌ ఉంటుంది. అదే చంద్రుడి మీద మరణిస్తే మృతదేహాన్ని భూమి మీదకు తీసుకురావడానికి కొన్ని రోజులు పడుతుంది. ఒకవేళ అంగారక గ్రహయాత్రలో ఎవరైనా చనిపోతే మాత్రం మృతదేహాన్ని భూమ్మీదకు తీసుకురాలేరు.

ఆ మిషన్‌ పూర్తయ్యే వరకు వేచి చూడాల్సి ఉంటుంది. అంటే మృతదేహం భూమిపైకి వచ్చేటప్పటికీ ఏళ్లు గడుస్తాయన్నమాట! స్పేస్‌సూట్ లేకుండా వ్యోమగాములు చంద్రుడు, లేదా అంగారకుడు మీద అడుగు పెడితే మాత్రం తక్షణమే ప్రాణాలు కోల్పోతారు. ఆక్సిజన్‌ లేకపోవడంతో మనిషి పీడనం కోల్పోతాడు. అంతే కాకుండా రక్తంలో వేడి పెరిగిపోతుంది.

క్షణాల్లో మనిషి నిర్జీవుడవుతాడు. భూమిపై మృతదేహలను ఖననం చేస్తే క్రిమి కీటకాలు వాటిని కుళ్లింపచేస్తాయి. అదే అంగారక గ్రహంమీద దిగిన తర్వాత మరణిస్తే మృతదేహలపై ఉండే బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మ క్రిములు అక్కడి వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. అందుకే మృతదేహాన్ని భూమికి తీసుకొచ్చేంత వరకు ప్రత్యేకమైన బాడీ బ్యాగ్‌లో భద్రపరుస్తారు. తర్వాత కుటుంబసభ్యులకు అందచేస్తారు. ఇప్పటి వరకు 20 మంది వ్యోమగాములు అంతరిక్షంలో చనిపోయారు.
1986-2003 వరకు నాసా నిర్వహించిన ప్రయోగాల్లో 14 మంది చనిపోయారు. 1967లో జరిగిన అపోలో లాంచ్‌ప్యాడ్‌ అగ్ని ప్రమాదంలో ముగ్గురు, 1971లో నిర్వహించిన సోయుజ్‌ 11 ప్రయోగంలో మరో ముగ్గురు వ్యోమగాములు మరణించారు.

Updated On 3 Aug 2023 3:48 AM GMT
Ehatv

Ehatv

Next Story