కొవ్వూరు నియోజకవర్గం చాగల్లు మండలంలో హోం మంత్రి(Home Minister) తానేటి వనిత(Taneti Vanita) గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సిపాయిల దిబ్బ వీధిలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత బజ్జీల కొట్టు వ్యాపారి లక్ష్మికి సహకరించారు. చిన్న బండిపై వ్యాపారం చేస్తున్నచెల్లింకుల లక్ష్మీ ఇంటికి వెళ్లిన మంత్రి..

Taneti Vanitha
కొవ్వూరు నియోజకవర్గం చాగల్లు మండలంలో హోం మంత్రి(Home Minister) తానేటి వనిత(Taneti Vanita) గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సిపాయిల దిబ్బ వీధిలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత బజ్జీల కొట్టు వ్యాపారి లక్ష్మికి సహకరించారు. చిన్న బండిపై వ్యాపారం చేస్తున్నచెల్లింకుల లక్ష్మీ ఇంటికి వెళ్లిన మంత్రి.. ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో అందించిన సాయాన్ని వివరించారు.
లక్ష్మి.. తన కూతురు శ్రీరాము 8వ తరగతి చదువుతోందని.. తనకి పడిన అమ్మ ఒడి డబ్బులతో చిన్న హోటల్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లు మంత్రికి వివరించారు. వెంటనే మంత్రి.. వారి చిరు వ్యాపారానికి అవసరమైన సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కాసేపు వారి హోటల్ లో సహాయం చేస్తూ.. బజ్జీలు అమ్మారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులకు హోంమంత్రి స్వహస్తాలతో టిఫిన్స్ అందజేశారు. చిల్లర ఇవ్వబడదంటూ.. వచ్చిన మొత్తాన్ని లక్ష్మికి అందజేశారు. పాప శ్రీరాము భవిష్యత్ కు అండగా ఉంటామని హోం మంత్రి తానేటి వనిత భరోసా కల్పించారు.
