మీరు రెండేళ్లకుపైగా జీ-మెయిల్‌(G-Mail) వాడటం లేదా. అయితే ఆ ఖాతాలను డిలీట్‌ చేయాలని గూగుల్‌(Google) నిర్ణయం తీసుకుంది. రెండేళ్లుగా వినియోగించని జీ-మెయిల్‌ ఖాతాలను తొలగిస్తామని గూగ్‌ ప్రకటించింది. డిసెంబర్‌ నుంచి దశలవారీగా ఈ అకౌంట్ల తొలంగింపు కార్యక్రమం ఉంటుందని గూగుల్‌ వెల్లడించింది.

మీరు రెండేళ్లకుపైగా జీ-మెయిల్‌(G-Mail) వాడటం లేదా. అయితే ఆ ఖాతాలను డిలీట్‌ చేయాలని గూగుల్‌(Google) నిర్ణయం తీసుకుంది. రెండేళ్లుగా వినియోగించని జీ-మెయిల్‌ ఖాతాలను తొలగిస్తామని గూగ్‌ ప్రకటించింది. డిసెంబర్‌ నుంచి దశలవారీగా ఈ అకౌంట్ల తొలంగింపు కార్యక్రమం ఉంటుందని గూగుల్‌ వెల్లడించింది. కనీసం రెండేళ్లుగా ఎలాంటి యాక్టివిటీ(Active) లేని జీ-మెయిల్ ఖాతాలు(Mail Accounts) తొలగిస్తామన్న గూగుల్‌, తొలగించే ముందు కొన్ని రోజుల ముందు అలర్ట్‌ మెసేజ్‌(Alert Message) పంపుతామని గత మే నెలలో గూగుల్ తన బ్లాగ్‌లో వెల్లడించింది. డిసెంబర్‌ నుంచి దశల వారీగా జీ-మెయిల్ ఖాతాల తొలగింపు కార్యక్రమం చేపడతామని గూగుల్‌ వెల్లడించింది. గతంలో 18 నెలలపాటు ఉపయోగించని ఖాతాలను తొలగించే గూగుల్‌ ఇప్పుడు ఆ సమయాన్ని 24 నెలలకు పెంచింది.

జీమెయిల్ ఖాతాల భద్రత, సమాచార గోప్యత కోసం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల పాటు యూజర్లను ఒక్కసారి కూడా ఉపయోగించని గూగుల్ ఖాతాలను పూర్తిగా తొలగిస్తామని స్పష్టం చేసింది. అలా డిలిట్ కానున్న జీ-మెయిల్ ఖాతాతోపాటు రికవరీ మెయిల్‌కు(Recovery Mails) కూడా అలర్ట్‌ మెసేజ్‌లు వస్తాయని తెలిపింది. కొన్ని రోజుల పాటు అలర్ట్‌ మెసేజ్‌లు పంపిస్తామని.. వాటికి రిప్లై రాకుంటే అలాంటి అకౌంట్లను పూర్తిగా తొలగిస్తామని గూగుల్‌ ప్రకటించింది. ఇప్పటికే డిలిట్ లిస్ట్‌లో జీ-మెయిల్ అకౌంట్లకు పలు హెచ్చరికల సందేశాలు పంపామని కూడా తెలిపింది. లిస్ట్‌లో ఉన్న జీ-మెయిల్ అకౌంట్లతోపాటు వాటితో అనుసంధానమైన డాక్స్(Documents), డ్రైవ్(Drive), మీట్, క్యాలండర్, ఫోటోస్‌(Photos) కూడా డిలిట్ అవుతుందని గూగుల్ పేర్కొంది. అయితే వ్యక్తిగత జీ-మెయిల్ అకౌంట్లు మాత్రమే డిలిట్ చేస్తామని వెల్లడించింది. రెండేండ్లకోసారైనా జీ-మెయిల్ ఖాతాలో లాగిన్ కావాలి. గూగుల్ అకౌంట్, దానికి అనుసంధానమైన ఏ సేవనైనా రెండేళ్లలో ఒకసారి వాడితే ఆ ఇబ్బందులు ఉండవని తెలిపింది.

గూగుల్ డ్రైవ్‌తో పాటు యూ-ట్యూబ్‌లో వీడియో చూసినా, గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏదైనా యాప్ డౌన్ లోడ్ చేసుకున్నా, గూగుల్ అకౌంట్‌ సాయంతో థర్డ్ పార్టీ యాప్ లాగిన్ అయినా.. అలాంటి ఖాతాలకు ఢోకా లేనట్లే. యూజర్లు వినియోగించని ఖాతాలకు సైబర్‌ ముప్పు ఉందని.. ఈ సమస్యను అధిగమించేందుకు అకౌంట్లు తొలగించే నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది

Updated On 12 Nov 2023 1:52 AM GMT
Ehatv

Ehatv

Next Story