ఇటీవల దేశంలో లోన్ యాప్ ల దందా విపరీతంగా పెరిగిపోయింది . యాప్ ల ద్వారా లోన్ తీసుకున్నవాళ్ళని తిరిగి చెల్లించమని ఒత్తిడికి గురిచేస్తున్నారు .డబ్బు చెల్లించలేక కొంతమంది ప్రాణాలు తీసుకుంటున్నారు . దాంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి . లోన్ యాప్ ల భాదితులు ఎక్కువగా పేద ,మధ్యతరగతి వారు కావటం బాధాకరం . చైనా(china) కి సంబందించిన నకిలీ యాప్ లు ఈ దారుణానికి పాల్పడుతున్నాయి .వీటికి ప్రభుత్వాలు కూడా గట్టి చర్యలు తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది . దీనికి సహకారంగా ఇప్పుడు గూగుల్(Google) 3500 లోన్ యాప్ లనుప్లే స్టోర్ నుండి తొలగించింది .

2022లో లోన్‌ల పేరుతో 3500 మోసపూరిత యాప్‌లను యాప్ స్టోర్ నుండి గూగుల్ (Google Play Store)తొలగించింది. దీంతో పాటు నిబంధనలను పాటించని 14.3 లక్షల యాప్‌లను ప్లే స్టోర్(Play store) నుంచి గూగుల్ (Google)తొలగించింది. 1.73 లక్షల ఫేక్ అకౌంట్లను నిషేధించినట్లు గూగుల్ తెలిపింది. ఈ యాప్‌లు 16 వేల 350 కోట్లు మోసం చేశాయని గూగుల్ తెలిపింది.మా షరతులను ,నిబంధనలను అప్‌డేట్ చేయడానికి మెరుగైన విధానాలను అమలులోకి తీసుకువస్తామని తెలిపింది .
ఈ విధానంలో త్వరలో ప్రైవసీ శాండ్‌బాక్స్‌ని(Privacy Sand Box) తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు గూగుల్(Google) తెలిపింది. ప్రైవసీ శాండ్‌బాక్స్ (Privacy Sand Box)అనేది ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో వినియోగదారుల ప్రైవసీని రక్షించే టెక్నాలజీ , అయితే దీనితో కంపెనీలు ఇంకా డెవలపర్‌లు వారి డిజిటల్ వ్యాపారాన్ని (Digital Business)సులభంగా అభివృద్ధి చేయవచ్చు. వివిధ యాప్‌లు ,సైట్‌ల ద్వారా ట్రాకింగ్‌ను తగ్గించడంలో ప్రైవసీ శాండ్‌బాక్స్ (Privacy Sand Box) సహాయపడుతుంది.
రాబోయే కొద్ది రోజుల్లో బీటా వినియోగదారుల కోసం ప్రైవసీశాండ్‌బాక్స్ విడుదల చేయనున్నట్లు గూగుల్(Google) తెలిపింది. దీని తర్వాత ఇది సాధారణ వినియోగదారుల కోసం విడుదల చేయబడుతుంది.