నగరాల్లో ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది కానీ.. మారుమూల పల్లెల్లో ఇంటర్నెట్ సేవలు ఉండడం చాలా తక్కువే
నగరాల్లో ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది కానీ.. మారుమూల పల్లెల్లో ఇంటర్నెట్ సేవలు ఉండడం చాలా తక్కువే. ఇక బ్రెజిల్ లాంటి దేశాల్లోని అడవుల్లో వివిధ తెగలు ఇంకా బతుకుతూనే ఉన్నాయి. అలాంటి వాళ్లకు ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుందా అని ప్రశ్నిస్తే.. అనుమానమే అని అందరూ అంటారు. కానీ అడవుల్లో వాళ్లకు ఇంటర్నెట్ ను ఇవ్వాలని ఎలాన్ మస్క్ అనుకోగా.. వాళ్లు చూస్తున్న కంటెంట్ ఏమిటో తెలిసి ప్రపంచం మొత్తం షాక్ అవుతోంది.
ఎలోన్ మస్క్ స్టార్‌లింక్ ద్వారా బ్రెజిలియన్ అడవుల్లోని తెగలకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇప్పించగా.. ఆ తెగ సభ్యులు ఎక్కువగా పోర్న్ చూస్తున్నారు. బ్రెజిల్‌లోని 2,000 మంది సభ్యులున్న మారుబో తెగ ఇంటర్నెట్‌ని పొందిన తర్వాత.. యువకులు పోర్న్, సోషల్ మీడియాకు అడిక్ట్ అయ్యారు. తెగకు చాలా నిర్దిష్టమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయి. ఈ సమూహంలోని సభ్యులను బహిరంగంగా ముద్దు పెట్టుకోవడానికి కూడా అనుమతించరు. ఇప్పుడు అశ్లీల కంటెంట్‌కు యువత బానిస అవ్వడంతో.. గిరిజనుల పురాతన ఆచారాలు ప్రభావితం అవుతాయని పెద్దలు ఆందోళన చెందుతున్నారు.
ఇంటర్నెట్ కారణంగా యువతలో సోమరితనం ఎక్కువైందని కూడా తెలుస్తోంది. అయితే దయచేసి తమకు ఇంటర్నెట్‌ను ఆపివేయద్దని వారు కోరుతున్నారు. పోర్న్, సోషల్ మీడియాతో పాటు మోసాలకు, తప్పుడు సమాచారానికి బాధితులు అవుతున్నారు. హింసాత్మక ఆటలు కూడా ఆడుతున్నారని.. గురవుతున్న ఇతర సమస్యలతో కూడా తెగ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది. ప్రస్తుతానికి తెగకు చెందిన నాయకులు ఇంటర్నెట్ లభ్యతను పరిమితం చేయాలని నిర్ణయించుకున్నారు. ఉదయం రెండు గంటలు.. సాయంత్రం ఐదు గంటలు స్విచ్ ఆన్ చేస్తుంటారు. ఆదివారాల్లో తెగ సభ్యులు రోజంతా ఇంటర్నెట్ ను వాడుకోవచ్చు.