ప్రప౦చ౦లో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ గా వాట్సాప్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ వాట్సాప్ ఉపయోగించే విధానం గురించి తెలియక ..ఇష్టం వచ్చినట్లు వాడితే మాత్రం కొన్ని కష్టాలను, నష్టాలను కోరి తెచ్చుకున్నట్లే .. అయితే తెలియకుండా లేదా అనుకోకుండా వాట్సాప్ లో ఈ పొరపాట్లు చేస్తే మాత్రం అకౌంట్ బ్యాన్ అవుతుంది .. దీని గురించి ఇపుడు వివరంగా తెలుసుకుందాం . సోషల్ మీడియా కి సంభ౦ది౦చి అకౌంట్స్ లేదా వాట్సాప్ వాటి […]

ప్రప౦చ౦లో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ గా వాట్సాప్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ వాట్సాప్ ఉపయోగించే విధానం గురించి తెలియక ..ఇష్టం వచ్చినట్లు వాడితే మాత్రం కొన్ని కష్టాలను, నష్టాలను కోరి తెచ్చుకున్నట్లే .. అయితే తెలియకుండా లేదా అనుకోకుండా వాట్సాప్ లో ఈ పొరపాట్లు చేస్తే మాత్రం అకౌంట్ బ్యాన్ అవుతుంది .. దీని గురించి ఇపుడు వివరంగా తెలుసుకుందాం .

సోషల్ మీడియా కి సంభ౦ది౦చి అకౌంట్స్ లేదా వాట్సాప్ వాటి షరతుల ప్రకారమే మనం ఉపయోగించాలి . ఈ యాప్స్ ని మిస్ యూజ్ చేసిన గాని లేదా షరతుల ఉల్లంఘన చేస్తే అకౌంట్స్ ను తొలిగించడం జరుగుతుంది . తప్పు మెసేజ్ పంపడం ,మనం మెసేజెస్ ను అడ్డుకోవడానికి లేదా ఎవరైనా మీ వాట్సాప్‌ అకౌంట్ నుంచి వచ్చే మెసేజీలు పంపకుండా బ్లాక్ చేస్తే మాత్రం మనం వెంటనే ఆ పనిని ఆపివేయాలి. ఒకేవేళ అలా చెయ్యకపోతే, మరింకెవరినా వాట్సాప్ యూజర్ మీ మీద కంప్లైంట్ చేస్తే మన వాట్సాప్ అకౌంట్ నిషేధించబడవచ్చు.

వాట్సాప్ యాప్ ప్లస్ లేదా జిబి వాట్సాప్ యాప్ వంటి థర్డ్ పార్టీ యాప్‌ లను ఉపయోగించడం వల్ల ఇబ్బందుల్లో పడవచ్చు. ఈ థర్డ్ పార్టీ యాప్స్ ను ఉపయోగించడం వల్ల కూడా మన వాట్సాప్ అకౌంట్ బ్లాక్ చేయబడవచ్చు. వాస్తవానికి, వాట్సాప్ ప్లస్ వెబ్‌సైట్‌లో వాట్సాప్ ప్లస్ అనేది వాట్సాప్ డెవలప్ చేయని యాప్ అని ... వాటికీ వాట్సాప్‌ పై ఎలాంటి హక్కులు లేవని కూడా స్పష్టంగా రాసి ఉంటుంది. బ్రాడ్ కాస్ట్ లిస్ట్ యొక్క అధిక వినియోగం బ్రాడ్ కాస్ట్ మెసేజీలను అతిగా లేదా నిరంతరం ఉపయోగించడం వల్ల కూడా అకౌంట్ కు నష్టం వాటిల్ల వచ్చు ఎందుకంటే, అలా చేయడం వల్ల వేరే వాళ్ళు మన మెసేజీల గురించి రిపోర్ట్ చేయవచ్చు. ఒకవేళ అలాచేస్తే వాట్సాప్ అకౌంట్ నిషేధాలకు దారితీయవచ్చని వాట్సాప్ యాప్ చెబుతోంది.

వాట్సాప్‌లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయడం లేదా మరొకరి అకౌంట్ ను కాపీ చేయడం వంటివి చాలా తీవ్రమైన చర్యగా పరిగణించబడుతుంది. ఇది తరచుగా వాట్సాప్ యాప్ బిజినెస్ అకౌంట్ వినియోగదారులతో జరుగుతుంది. మీరు ఇలా చేస్తే వాట్సాప్ యాప్ .., అకౌంట్ ను బ్లాక్ చేస్తుంది. మీరు మీ వాట్సాప్ అకౌంట్ ద్వారా బల్క్ మెసేజ్, ఆటో-మెసేజ్ లేదా ఆటో-డయల్ చేస్తే, వాట్సాప్ మిమ్మల్ని అలా చేయడానికి అనుమతించదు. వాట్సాప్‌లో హానికరమైన ఫైల్స్ ను పంపి౦చిన కూడా మీరు వాట్సాప్‌ నుంచి నిషేధించబడవచ్చు.

Updated On 21 Feb 2023 6:05 AM GMT
Ehatv

Ehatv

Next Story