శుక్రవారం మధ్యాహ్నం 2.05 గంటల నుంచి 27.30 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–14 రాకెట్‌ను

శ్రీహరికోటలో జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 14 రాకెట్ ప్రయోగానికి శాస్త్రవేత్తలు అంతా సిద్ధం చేశారు. ఈరోజు మధ్యాహ్నం 2.05 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 14 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమవుతుంది. శనివారం సాయంత్రం 5.35 గంటలకు ప్రయోగం జరగనుంది. ఇన్సాట్ త్రీడీఎస్ ఉగ్రహాన్ని నింగిలోకి ఇస్రో శాస్త్రవేత్తలు పంపనున్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 14 రాకెట్ ను ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు. వాతావరణ పరిస్థితుల అధ్యయనం కోసం ఈ రాకెట్ ను షార్ నుండి ప్రయోగించనున్నారు.

శుక్రవారం మధ్యాహ్నం 2.05 గంటల నుంచి 27.30 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–14 రాకెట్‌ను ప్రయోగిస్తారు. మొత్తం 2,272 కిలోలు బరువు కలిగిన ఇన్‌శాట్‌–3డీఎస్‌ ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టేలా ఇస్రో శాస్త్రవేత్తలు డిజైన్‌ చేశారు. ఇది షార్‌ కేంద్రం నుంచి 92వ ప్రయోగం కాగా, జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 16వ ప్రయోగం. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో క్రయోజనిక్‌ ఇంజిన్లు తయారు చేసుకుని చేస్తున్న 10వ ప్రయోగం. షార్‌ కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–14 రాకెట్‌ను ప్రయోగించనున్నారు.

Updated On 15 Feb 2024 10:10 PM GMT
Yagnik

Yagnik

Next Story