ఐ సైట్ ప్రాబ్లెమ్స్ కు చాలామంది కాంటాక్ట్ లెన్స్‌లు వాడటం ఇప్పుడు కామన్ అయిపోయింది. అంతే కాదు ఫ్యాషన్ కూడా అయి౦ది . గతం లో పెద్దలకు మాత్రమే ఉండే కంటి చూపు సమస్యలు ..ఇప్పుడు చిన్నారులకు కూడా వస్తున్నాయి . ఈ కంటి చూపు సమస్యలు రావాడానికి సరి అయిన పోషకాలు ఉన్న పండ్లు , కూరగాయలు తీసుకోకుండా జంక్ ఫుడ్ కు అలవాటు పడటమే ముఖ్య కారణం అంటున్నారు వైద్య నిపుణులు . […]
ఐ సైట్ ప్రాబ్లెమ్స్ కు చాలామంది కాంటాక్ట్ లెన్స్‌లు వాడటం ఇప్పుడు కామన్ అయిపోయింది. అంతే కాదు ఫ్యాషన్ కూడా అయి౦ది . గతం లో పెద్దలకు మాత్రమే ఉండే కంటి చూపు సమస్యలు ..ఇప్పుడు చిన్నారులకు కూడా వస్తున్నాయి . ఈ కంటి చూపు సమస్యలు రావాడానికి సరి అయిన పోషకాలు ఉన్న పండ్లు , కూరగాయలు తీసుకోకుండా జంక్ ఫుడ్ కు అలవాటు పడటమే ముఖ్య కారణం అంటున్నారు వైద్య నిపుణులు .
అయితే టెక్నాలజీ పెరగడం వల్ల కళ్లద్దాలు పెట్టుకొనే వారి సంఖ్య తగ్గి పోయి ...కాంటాక్ట్ లెన్స్ ధరించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కంటి చూపును మెరుగుపరుచుకోవడానికి, అందంగా కనబడటానికి కాంటాక్ట్ లెన్స్ వాడకం పెరిగినది. కాంటాక్ట్ లెన్స్ కంఫర్ట్ గా మరియు ఫ్లెక్సిబుల్ గా ఉండటం వల్ల వీటి వాడకం ఎక్కువైనది. అయితే కొంత మంది మాత్రం ఫ్యాషన్ కోసం ధరించే వారు కూడా ఉన్నారు. కొంత మంది మాత్రం వివిధ కారణాల వల్ల అద్దాలు ధరించడానికి ఇష్టపడరు. ఆ కారణాలు పక్కనపెట్టి, మీరు కనుక కాంటాక్ట్ లెన్స్ ఉపయోగిస్తున్నట్లైతే వాటిని రెగ్యులర్ గా సరిగా శుభ్రం చేస్తుండాలి. సరిగా శుభ్రం చేయకపోతే అవి కళ్ళ ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది.
ఈ కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవడం వల్ల దుష్పభావాలు కూడా ఉన్నాయి. అందుకే కాంటాక్ట్ లెన్స్ పెట్టుకొనే వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం .
లెన్స్ ధరించేటప్పుడు చాలా మంది చేసే మిస్టేక్స్ 24 గంటల పాటు కాంటాక్ట్ లెన్సులు వేసుకొంటారు . దీని వల్ల కంటికి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని నేత్ర వైద్యులు హెచ్చరిస్తున్నారు . అయితే రోజుకు 8 నుంచి 10 గంటల పాటు కాంటాక్ట్ లెన్స్‌లు ధరించడం మాత్రమే సురక్షితమని సూచిస్తున్నారు. మరీ ఎక్కువ సేపు లెన్సెస్ పెట్టుకుని ఉండడం వల్ల పర్మినెంట్ గా కంటి చూపు డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. కాంటాక్ట్ లెన్స్ పెట్టుకొని నిద్రపోవడం వల్ల కూడా కంటి చూపు ని కోల్పోయే ప్రమాద౦ ఉందంటున్నారు వైద్యులు . అందుకే నిద్ర పోయేముందు లెన్స్ తీసి నిద్ర పోవాలి .
స్మోకింగ్ చేసే వారు కాంటాక్ట్ లెన్స్ ఉపయోగించడం వల్ల కార్నియల్ అల్సర్ తో బాధపడుతారని కొన్ని పరిశోధనల ద్వారా నిర్ధారించబడినది. కొంత మందిలో కాంటాక్ట్ లెన్స్ వాడకం వల్ల కళ్ళ పొడి బారడం జరుగుతుంది. కాంటాక్ట్స్ కళ్ళను కవర్ చేయడం వల్ల కళ్ళకు ఆక్సిజన్ సరఫరా బ్లాక్ అవుతుంది . ఆ కారణం వల్ల కళ్ళ పొడిబారడం జరుగుతుంది. స్విమ్మింగ్ చేసేవారు, పూల్లో స్విమ్ చేయడానికి ముందు కాంటాక్ట్స్ లెన్స్ ను తొలగించి స్విమ్ చేయడం మంచిది. దుమ్ము , ధూలి కాంటాక్ట్ లెన్స్ లో చేరడం వల్ల కళ్ళు అసౌకర్యానికి గురి అవ్వడంతో కళ్ళ నుంచి నీరు ఎక్కువగా కారీ, పరిస్థితిని తీవ్రతరం చేస్తుంది