ఇటీవలి కాలంలో సెక్స్‌డాల్స్(Sex Dolls) సేల్స్ పెరిగాయని ఓ నివేదిక తెలిపింది.
ఇటీవలి కాలంలో సెక్స్‌డాల్స్(Sex Dolls) సేల్స్ పెరిగాయని ఓ నివేదిక తెలిపింది.శారీరక అవసరాలను తీర్చుకోవడానికి సెక్స్ డాల్స్‌ను ఉపయోగిస్తుంటారు. మన దేశంలో వీటి అమ్మకాలు అంతంత మాత్రమే అయినా చాలా దేశాలలో ఇష్టపడి కొంటున్నారు. ఇక సెక్స్ డాల్స్‌కు కృత్రిమ మేధ (ఏఐ)ను జత చేసి సెక్స్ రోబోలు(Sex Robots)గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు చైనా సైంటిస్టులు(Chinese scientists). ఇకపై శరీర వాంఛలను తీర్చడమే కాదు, మాట్లాడగలిగేలా సెక్స్ రోబోలను తయారుచేస్తున్నారు. షెన్‌జెన్(Shenzen)కు చెందిన స్టార్‌పెరీ టెక్నాలజీ(Starperi Technology) అనే సెక్స్ డాల్స్ తయారీ సంస్థ త్వరలోనే వీటిని మార్కెట్‌లోకి తీసుకురాబోతున్నది. మగ, ఆడ రూపాలలో వీటిని తయారు చేస్తున్నట్టు సౌత్ చైనా మార్నింగ్ పోస్టు(South China Morning Post) ఓ కథనంలో చెప్పింది. ఏఐ ఆధారిత సెక్స్ డాల్స్ సెక్స్ కోరికలు తీర్చడంతో పాటు వినియోగదారులతో భావోద్వేగ సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఆ విధంగా తయారు చేస్తున్నట్టు స్టార్‌పెరీ టెక్నాలజీ సీఈవో ఈవాన్ లీ(Starperi Technology CEO Evan Lee) అంటున్నాడు.