ఫోన్‌కు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులకు(Electronic) ఇకపై చార్జింగ్‌(Charge) పెట్టాల్సిన అవసరం లేదు. చైనాకు(China) చెందిన ఓ కంపెనీ 50 ఏళ్ల వరకు చార్జింగ్‌ ఉండే బ్యాటరీని తయారుచేసిందట. ఈ న్యూక్లియర్ బ్యాటరీని(Nuclear Battery) బీజింగ్‌కు(Beijing) చెందిన బీటావోల్ట్(Betavolt) అభివృద్ధి చేసింది.

ఫోన్‌కు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులకు(Electronic) ఇకపై చార్జింగ్‌(Charge) పెట్టాల్సిన అవసరం లేదు. చైనాకు(China) చెందిన ఓ కంపెనీ 50 ఏళ్ల వరకు చార్జింగ్‌ ఉండే బ్యాటరీని తయారుచేసిందట. ఈ న్యూక్లియర్ బ్యాటరీని(Nuclear Battery) బీజింగ్‌కు(Beijing) చెందిన బీటావోల్ట్(Betavolt) అభివృద్ధి చేసింది. కానీ దీని పరిమాణం ఎంత పెద్ద సైజు ఉంటుందోనని ఊహించుకుంటే మీరు పొరబడినట్లే. చిన్న కాయిన్‌ మాదిరిలా ఈ బ్యాటరీ ఉంటుందట. ఈ బ్యాటరీ ఏరోస్పేస్, AI పరికరాలు, వైద్య పరికరాలు, మైక్రోప్రాసెసర్‌లు, అధునాతన సెన్సార్‌లు, చిన్న డ్రోన్‌లు, మైక్రో-రోబోట్‌ల వాటికి దీర్ఘకాలిక విద్యుత్ సరఫరాను అందచేస్తుందని ఈ కంపెనీ వెల్లడించింది.

ఈ బ్యాటరీ యొక్క కొలతలు 15 x 15 x 5 మిల్లీమీటర్లు ఉంటుంది. న్యూక్లియర్ ఐసోటోప్‌లు, డైమండ్ సెమీకండక్టర్ల పొరతో తయారు చేశారు. న్యూక్లియర్ బ్యాటరీ ప్రస్తుతం 100 మైక్రోవాట్ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అయితే, 2025 నాటికి 1-వాట్ పవర్ ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా దీని ద్వారా వచ్చే డియేషన్ వల్ల మానవాళికి ఎలాంటి ప్రమాదం ఉండదని బీటావోల్ట్ తెలిపింది. ప్రత్యేకమైన లేయర్డ్‌ డిజైన్‌తో దీనిని తయారు చేశామని, ఈ బ్యాటరీ పేలిపోయే ప్రసక్తే లేదని, మైనస్‌ 60 డిగ్రీల సెల్సియస్ నుంచి 120 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉన్నా ఈ బ్యాటరీ పని చేయగలదని బీటావోల్ట్ పేర్కొంది. అన్ని అనుమతులు, అన్ని రకాల పరీక్షల తర్వాత దీనిని మార్కెట్‌లోకి తీసుకొస్తామని బీటావోల్ట్ తెలిపింది.

Updated On 16 Jan 2024 12:50 AM GMT
Ehatv

Ehatv

Next Story