ప్రజలను మోసం చేసేందుకు హ్యాకర్లు(Hackers) కొత్త కొత్త ట్రిక్స్‌ను కనిపెట్టారు.
ప్రజలను మోసం చేసేందుకు హ్యాకర్లు(Hackers) కొత్త కొత్త ట్రిక్స్‌ను కనిపెట్టారు. తాజాగా నివేదిక షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. మీరు గూగుల్ సెర్చ్‌లో(Google search) ఏదైనా టైప్ చేసి సెర్చ్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. హ్యాకర్లు అలాంటి కొన్ని మోసపూరిత లింక్‌లను సృష్టించారు, మీరు వాటిని క్లిక్ చేస్తే, మీ వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఈ పని కోసం, హ్యాకర్లు SEO పాయిజనింగ్ టెక్నిక్‌ని ఉపయోగిస్తున్నారు. Googleలో కనిపించే ఈ ప్రమాదకరమైన లింక్‌లపై మీరు క్లిక్ చేసిన వెంటనే, మీ భద్రత మరియు గోప్యత రెండూ ప్రమాదంలో పడతాయి.
SEO పాయిజనింగ్(SEO Poisoining technique) అనేది హ్యాకర్లు సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్‌ను తారుమారు చేసే టెక్నిక్. తద్వారా Googleలో సెర్చ్ చేస్తే ప్రమాదకరమైన లింక్‌లు కనిపిస్తాయి. మీరు ఈ లింక్‌లపై క్లిక్ చేసి, సైట్‌కి వెళ్లగానే, మీ వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు, లాగిన్ ఐడి, పాస్‌వర్డ్ వంటి ముఖ్యమైన సమాచారం దొంగిలించబడతాయి.మీరు ఈ లింక్‌లపై క్లిక్ చేసిన వెంటనే, గూట్‌లోడర్ అనే ప్రోగ్రామ్ సిస్టమ్‌లోకి డౌన్‌లోడ్ అయ్యే ప్రమాదం పెరుగుతుందని నివేదిక పేర్కొంది. ఈ మాల్వేర్ మీ సిస్టమ్‌పై నియంత్రణను హ్యాకర్లకు అందించగలదు, తద్వారా హ్యాకర్లు మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించవచ్చు. మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేయవచ్చు.
హ్యాకర్లను నివారించాలంటే ఏం చేయాలి?
బలమైన పాస్‌వర్డ్(strong password) : అన్ని ఖాతాలకు విభిన్నమైన, బలమైన పాస్‌వర్డ్‌లను పెట్టుకోవాలి. పాస్‌వర్డ్‌లో అక్షరాలు స్మాల్ లెటర్స్, బిగ్‌లెటర్స్, స్పెషల్ సింబల్స్ యాడ్ చేసుకోవాలి. పాస్‌వర్డ్‌ను క్రమం తప్పకుండా మారుస్తూ(Frequent password chang) ఉండండి. తెలియని లింక్‌లు, పబ్లిక్ Wi-Fi(Public wifi) అనుమానాస్పద ఇమెయిల్‌లు, లింక్‌లు లేదా సందేశాలపై క్లిక్ చేయవద్దు. ఇది కాకుండా, పబ్లిక్ Wi-Fi నెట్‌వర్క్‌లలో బ్యాంకింగ్ సమాచారం లేదా పాస్‌వర్డ్‌లను షేర్ చేయవద్దు. సిస్టమ్‌ను రక్షించడానికి యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయండి. దాన్ని క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయండి.