Good bye to driving license and RC cards : వాహనదారులకు శుభవార్త.. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డులకు గుడ్ బై
ఏపీ ప్రభుత్వం(AP Government) రాష్ట్రంలోని వాహనదారులకు శుభవార్త చెప్పింది. వాహనదారులు పోలీసుల తనిఖీల(Vehicle ) సమయంలో ఆపినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్(Driving license), ఆర్సీ కార్డులు(RC Cards) చూపించాల్సి ఉంటుంది. అయితే.. ఆ ఇబ్బంది నుంచి వాహనదారులకు ఏపీ ప్రభుత్వం ఊరట కల్పించనుంది. ఇక నుంచి రవాణాశాఖ జారీచేసే డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు కార్డుల రూపంలో ఉండవు.

Good bye to driving license and RC cards
ఏపీ ప్రభుత్వం(AP Government) రాష్ట్రంలోని వాహనదారులకు శుభవార్త చెప్పింది. వాహనదారులు పోలీసుల తనిఖీల(Vehicle ) సమయంలో ఆపినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్(Driving license), ఆర్సీ కార్డులు(RC Cards) చూపించాల్సి ఉంటుంది. అయితే.. ఆ ఇబ్బంది నుంచి వాహనదారులకు ఏపీ ప్రభుత్వం ఊరట కల్పించనుంది. ఇక నుంచి రవాణాశాఖ జారీచేసే డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు కార్డుల రూపంలో ఉండవు. మీ మొబైల్ ఫోన్‌లో సంబంధిత యాప్‌లో డౌన్‌లోడ్ చేసిన పత్రాలే దీనికి సరిపోతాయని పేర్కొంటూ రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఇప్పటి వరకు కార్డుకు రూ. 200, పోస్టల్ సర్వీస్‌కు రూ.25 ఇలా మొత్తం రూ. 225 చలానాతో కలిపి వసూలు చేసేవారు. తాజాగా రవాణాశాఖ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులతో ఇప్పుడు ఆ ఛార్జీలను వసూలు చేయడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికే లైసెన్సులు, ఆర్సీ కార్డుల కోసం డబ్బులు చెల్లించిన వాహనదారులకు మాత్రం త్వరలో కార్డులను అందజేస్తారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల రవాణాశాఖకు సంబంధించి ‘వాహన్ పరివార్’తో(Vahan Parivar) సేవలన్నీ ఆన్‌లైన్ చేసింది. దీంతో చాలా రాష్ట్రాల్లో కార్డులను తొలగించి డిజిటల్ రూపంలోనే పత్రాలు తీసుకొచ్చారు. తాజాగా ఏపీలోనూ ఆ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. మొబైల్ లో ఏపీ ఆర్టీఏ సిటిజన్ యాప్(APRTA Citizen) ద్వారా మీరు పత్రాలను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ స్మార్ట్‌ఫోన్ లేనివారు పేపర్‌పై సంబంధిత పత్రాలను ప్రింట్ తీసుకొని మీ జేబులో ఉంచుకుంటే సరిపోతుంది. వాహనదారులు మొబైల్‌లో యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే. రవాణాశాఖ వెబ్‌సైట్ హెచ్‌టీటీపీఎస్//ఏపీఆర్‌టీఎసిటిజన్.ఈప్రగతి.ఓఆర్జీ లో ఫాం 5 లేదా 23ని డౌన్‌లోడ్ చేసుకొని ధృవపత్రాన్ని తీసుకోవాలి. లేదా.. ఏపీఆర్‌టీఏసిటిజన్ అనే యాప్‌ను మీ ఆండ్రాయిడ్ మొబైల్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పోలీసులు వాహనాలు ఆపినప్పుడు ఈ యాప్ ద్వారా వాహన పత్రాలను చూపిస్తే సరిపోతుంది. వీటిని అనుమతించాలని పోలీసులు, రవాణాశాఖ అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
